DRDO Drone Crashes During Trial In Karnataka Chitradurga - Sakshi
Sakshi News home page

పొలాల్లో కుప్పకూలిన డీఆర్‌డీఓ డ్రోన్.. దృశ్యాలు వైరల్..

Aug 20 2023 3:04 PM | Updated on Aug 20 2023 3:18 PM

DRDO Drone Crashes During Trial In Karnataka Chitradurga - Sakshi

బెంగళూరు: రక్షణ శాఖ(డీఆర్‌డీఓ)కు చెందిన డ్రోన్ కుప్పకూలింది. కర్ణాటక చిత్రదుర్గ జిల్లాలో పంట పొలాల్లో ఈ మానవ రహిత డ్రోన్‌ కూలిపోయింది. ప్రమాద ఘటనకు సంబంధించిన డ్రోన్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రమాద ప్రదేశానికి పరిసర ప్రాంతాల్లోని ప్రజలు గుమిగూడారు. 

డీఆర్‌డీఓ మానవ రహిత డ్రోన్‌లపై పరిశోధనలో భాగంగా.. ఆదివారం తాపస్‌ అనే డ్రోన్‌ను ట్రయల్ రన్‌ చేశారు. ఈ క్రమంలో అది కూలిపోయింది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. దీనిపై రక్షణ శాఖ దర్యాప్తు చేపడుతోంది. ప్రమాద స్థలంలో డ్రోన్ ధ్వంసమైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇదీ చదవండి:  చంద్రయాన్‌-3: చంద్రుడికి అడుగు దూరంలో ఇస్రో ‘విక్రమ్‌’.. ఇక చివరి ఘట్టం అదే

Advertisement
 
Advertisement
Advertisement