న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత మళ్లీ పడిపోయింది. గురువారం నగరం మొ త్తం గాలి నాణ్యత పేలవంగా మారింది. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు(పీసీబీ) ప్రకారం ఏక్యూఐ 264కి పెరిగింది. రాబోయే రోజుల్లో మరింత క్షీణిస్తుందని పీసీబీ హెచ్చరించింది. రాజధానిలోని అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా ఐటీవో చుట్టూ దట్టమైన పొగమంచు ఆవరించింది. ఇక్కడ గురువారం ఉదయం ఏక్యూఐ 290ని తాకింది. ఉత్తర ఢిల్లీలోని నరేలాలోనూ గాలి నాణ్యత దారుణంగా ఉంది. ఏక్యూఐ ఇక్క డ 294గా నమోదైంది.
ఢిల్లీలో దాదాపు వారం తర్వాత బుధవారం అత్యంత స్వచ్ఛమైన గాలి నమోదైంది. గురువారానికి తిరోగమించింది. బుధవారం తగ్గిన కీలకమైన కాలుష్య కారకాల స్థాయిలు గురువారం ఉదయం నాటికి, నగరంలోని 38 పర్యవేక్షణ కేంద్రాలలో చాలా వరకు ఆందోళనకరమైన స్థాయికి తిరిగొచ్చాయి. ఒక్క ఢిల్లీనే కాదు, రాజధానికి ఆనుకుని ఉన్న నగరాల్లోనూ గాలి నాణ్యత క్షీణించింది. ఏక్యూఐ గురుగ్రామ్‌లో 229, నోయిడాలో 216, ఘజియాబాద్‌లో 274గా నమోదైంది. çఫరీదాబాద్‌లో ఏక్యూఐ 187 నమోదైంది. ఢిల్లీ కంటే కొంచెం మెరుగ్గా ఉంది.
గాలి వేగం తగ్గటం వల్లే...
గాలి వేగం గంటకు 10 కిలోమీటర్ల కంటే తక్కు వగా పడిపోవడం వల్లే కాలుష్య కారకాలు పేరు కుపోతున్నాయని ఎయిర్ క్వాలిటీ హెచ్చరిక వ్యవస్థ తెలిపింది. మరో రెండు రోజుల పాటు గాలి నాణ్యత పేలవంగానే ఉంటుందంది.


