ఢిల్లీ గాలి నాణ్యత కోసం కేంద్రం తీసుకున్న చర్యలను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కాలుష్య నియంత్రణకోసం నిర్మాణం రంగాన్ని పూర్తిగా నిలిపివేయడం సరైన చర్యకాదని తెలిపింది. ఢిల్లీతో పాటు ఆ నగర పరిసర ప్రాంతాలలో నిర్మాణాలు, ఇతర కట్టడాలపై విధించిన నిషేదాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది
తాము పర్యావరణ నిపుణులు కామని, అయితే పర్యావరణ పరిరక్షణ అనేది అభివృద్ధిని అడ్డుకోకుండా ఉండాలని సుప్రీంకోర్టు చీప్ జస్టిస్ బీఆర్ గవాయ్ తెలిపారు. గాలి కాలుష్యాన్ని అడ్డుకోవడానికి తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. నిర్మాణ రంగంపై లక్షలాది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని దానిని పూర్తిగా నియంత్రిస్తే అది వారి కుటుంబాలపై ప్రభావం చూపిస్తుందని అది తీవ్రమైన సామాజిక ఆర్థిక పరిస్థితికి దారితీస్తుందని తెలిపారు. పర్యావరణ రక్షించడానికి నవంబర్ 19లోగా ఒక ప్రణాళికతో ముందుకు రావాలని జస్టిస్ బీఆర్ గవాయ్ కేంద్రానికి ఆదేశాలు జారీ చేశారు.
ఢిల్లీ పర్యావరణాన్ని రక్షించే బాధ్యత కేంద్రానిదేనని స్థానిక ప్రభుత్వానిది కాదని తెలిపారు. అదే విధంగా కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు, గాలి నిర్వహణ కమిషన్ ఢిల్లీలోని ప్రస్తుత వాయు కాలుష్య పరిస్థితులను వివరించాలని ఆదేశించారు. దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత పూర్తిగా క్షీణించడంతో ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాలలో నిర్మాణాలు చేపట్టడం, కూల్చివేయడాన్ని నిషేదిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కోర్టు దానిని తిరస్కరించింది.


