తమిళనాడు: పల్లావరం సమీపం అనకాపుత్తూరు, కస్తూరిబాయి నగర్ లో నివసించే పెరుమాళ్ (58) చేపల వ్యాపారం చేసేవాడు. మూడు నెలల క్రితం అనారోగ్యంతో అతని కుమారుడు మరణించాడు. దీని తరువాత, కోడలు తన 8 ఏళ్ల కుమార్తె, 4 ఏళ్ల కుమారుడితో కలిసి తన మామ పెరుమాళ్, అత్తగారితో నివసిస్తోంది.
ఆ మహిళ అత్త రెండు రోజుల క్రితం కాంచీపురంలోని తన బంధువుల ఇంటికి వెళ్లింది. దీంతో పెరుమాళ్, అతని కోడలు తమ పిల్లలతో ఇంట్లోనే ఉన్నారు. ఈ స్థితిలో, బుధవారం పెరుమాల్ తన పిల్లలతో కలిసి గదిలో ఒంటరిగా నిద్రిస్తున్న కోడలిని లైంగికంగా వేధించి, ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఆ మహిళ దీనిని అడ్డుకోవడానికి ప్రయత్నించి, కోపం తో అక్కడే ఉన్న కత్తితో పెరుమాల్ మెడపై పొడిచింది. ఈ దాడిలో పెరుమాల్ అక్కడికక్కడే మరణించాడు. ఈ విషయం శంకర్ నగర్ పోలీసుల విచారణలో పెరుమాళ్‌ను అతని కోడలే కత్తితో పొడిచి చంపినట్లు తేలింది.
మామను చంపిన తర్వాత కోడలు ఇంటి నుండి బయటకు వచ్చి, అతను తనతో అసభ్యంగా ప్రవర్తించడానికి యత్నించినందునే చంపినట్లు ఇరుగుపొరుగు వారికి చెప్పింది. పోలీసులకు తనను అప్పగించమని కోరింది. తన పిల్లలను జాగ్రత్తగా చూసుకోమని కోరినట్లు తెలుస్తోంది. తనతో అసభ్యంగా ప్రవర్తించడానికి యత్నించిన వ్యక్తి నుండి తప్పించుకునే క్రమంలో ఆత్మరక్షణ చర్యగా ఈ హత్య పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈమేరకు ఆ మహిళను అరెస్టు చేయకుండా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.


