
రెండు రోజులపాటు ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష
పలు దశల్లో పోలింగ్..ఈ నెలాఖరులో తొలి విడత జరిగే చాన్స్
న్యూఢిల్లీ: బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల కమిషర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు వివేక్ జోషి, ఎస్‌ఎస్ సంధు శనివారం పట్నాకు వెళ్లనున్నారు. వీరు రెండు రోజులపాటు అక్కడి అధికారులతో సమావేశం నిర్వహించి సమీక్షిస్తారు. 243 సీట్లున్న రాష్ట్ర అసెంబ్లీ గడువు నవంబర్ 22న ముగియనుంది. అక్టోబర్ నెలాఖరులో పోలింగ్ ప్రారంభమై వచ్చే నెలలో పలు దశల్లో పోలింగ్ జరగనుంది.
ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే ముందు ఈసీ ఆయా రాష్ట్రాల్లో పర్యటించడమనేది సాధారణంగా జరిగే ప్రక్రియ. ఇందులోభాగంగా ఈసీ రాజకీయ పారీ్టల ప్రతినిధులు, పాలనా సంబంధిత అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, రాష్ట్ర ఎన్నికల అధికారులతో సమావేశమవుతుంది. ఎన్నికల నిర్వహణ సిబ్బంది ఆయా చట్టాలు, నియమాలతో పూర్తి అవగాహనతో ఉండి పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించేలా ఈసీ సమాయత్తం చేస్తుంది.
కేంద్ర పరిశీలకులు బరిలో నిలిచే అభ్యర్థులకు సమాన అవకాశాలు ఉండేలా నిర్ధారించుకుంటారు. రాజకీయ పారీ్టలు, అభ్యర్థులు, ఓటర్ల సమస్యలను తీర్చేందుకు పరిశీలకులు అందుబాటులో ఉండాల ని చెప్పారు. ఓటర్ల సౌలభ్యం కోసం ఈసీ తీసుకొ చ్చిన కార్యక్రమాలు సరిగా అమలవుతున్నాయో లేదో చూసేందుకు పరిశీలకులు పోలింగ్ బూత్‌ల ను సందర్శించాలని ఈసీ ఆదేశించింది. గత సెపె్టంబర్ 30న ప్రచురితమైన ఓటర్ల తుది జాబితా ప్రకారం 7.42 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.