breaking news
ECI group
-
నేడు బిహార్‌కు సీఈసీ బృందం
న్యూఢిల్లీ: బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల కమిషర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు వివేక్ జోషి, ఎస్ఎస్ సంధు శనివారం పట్నాకు వెళ్లనున్నారు. వీరు రెండు రోజులపాటు అక్కడి అధికారులతో సమావేశం నిర్వహించి సమీక్షిస్తారు. 243 సీట్లున్న రాష్ట్ర అసెంబ్లీ గడువు నవంబర్ 22న ముగియనుంది. అక్టోబర్ నెలాఖరులో పోలింగ్ ప్రారంభమై వచ్చే నెలలో పలు దశల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే ముందు ఈసీ ఆయా రాష్ట్రాల్లో పర్యటించడమనేది సాధారణంగా జరిగే ప్రక్రియ. ఇందులోభాగంగా ఈసీ రాజకీయ పారీ్టల ప్రతినిధులు, పాలనా సంబంధిత అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, రాష్ట్ర ఎన్నికల అధికారులతో సమావేశమవుతుంది. ఎన్నికల నిర్వహణ సిబ్బంది ఆయా చట్టాలు, నియమాలతో పూర్తి అవగాహనతో ఉండి పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించేలా ఈసీ సమాయత్తం చేస్తుంది. కేంద్ర పరిశీలకులు బరిలో నిలిచే అభ్యర్థులకు సమాన అవకాశాలు ఉండేలా నిర్ధారించుకుంటారు. రాజకీయ పారీ్టలు, అభ్యర్థులు, ఓటర్ల సమస్యలను తీర్చేందుకు పరిశీలకులు అందుబాటులో ఉండాల ని చెప్పారు. ఓటర్ల సౌలభ్యం కోసం ఈసీ తీసుకొ చ్చిన కార్యక్రమాలు సరిగా అమలవుతున్నాయో లేదో చూసేందుకు పరిశీలకులు పోలింగ్ బూత్‌ల ను సందర్శించాలని ఈసీ ఆదేశించింది. గత సెపె్టంబర్ 30న ప్రచురితమైన ఓటర్ల తుది జాబితా ప్రకారం 7.42 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. -
పరిశీలించారు..అనుమతి ఇస్తారా?
నిజామాబాద్‌అర్బన్, న్యూస్‌లైన్ : జిల్లా మెడికల్ కళాశాలను శనివారం ఎంసీఐ బృందం పరిశీలించింది. కళాశాలలో రెండో సంవత్సరం తరగతుల నిర్వహణకు అనుమతి ఇచ్చే విషయమై ఎంసీఐ బృంద సభ్యులు డాక్టర్ వీఎన్.త్రిపాఠి, డాక్టర్ రంగనాథ్ వచ్చారు. ఉదయం 9 గంటలకే కళాశాలకు చేరుకొని సాయంత్రం 5.30 గంటల వరకు ఉన్నారు. కళాశాలలోని ప్రొఫెసర్ల విభాగాలు, గ్రంథాలయం, పరీక్షల గదులు, ఆడిటోరియం, తరగతి గదులు, వసతి గృహాలను తనిఖీ చేశారు. అధికారులతో సమావేశమై విద్యార్థులకు కల్పించిన సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. జిల్లా ఆ స్పత్రిలోని అత్యవసర విభాగం, గైనిక్ విభాగం, పిల్లల వార్డు, ఆర్థోపెడిక్, ఓపీ విభాగాలను పరిశీలించారు. ఆస్పత్రి వర్గాలతో మాట్లాడి ‘ఆస్పత్రిలో ఎంత మంది రోగులున్నారు. వారికి అందుతున్న వైద్యసేవలు ఎలా ఉన్నాయి’ వంటి వివరాలు తెలుసుకున్నారు. ఎనిమిదో అంతస్తులోని విభాగాలను, మెడికల్ కళాశాలకు సంబంధించిన నివేదికలను, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాల వివరాలను, ఆస్పత్రిలో వైద్యసేవలు అందించే తీరును పరిశీలించి వెళ్లారు. రెండోసారి.. మెడికల్ కళాశాలలో రెండో సంవత్సరం తరగతుల నిర్వహణకు అనుమతి ఇచ్చే విషయమై ఎంసీఐ బృందం ఈ ఏడాది ఫిబ్రవరి 23, 24 తేదీల్లో కళాశాలను సందర్శించిన విషయం తెలిసిందే. కళాశాలలో గ్రంథాలయం సక్రమంగా లేకపోవడం, ప్రొఫెసర్ల కొరత తదితర కారణాలతో రెండో సంవత్సరానికి అనుమతి నిరాకరించారు. దీంతో కళాశాల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. విద్యార్థులు నిరసనకు దిగారు. అధికారుల విజ్ఞప్తితో ఎంసీఐ బృందం రెండోసారి కళాశాలకు వచ్చింది. ఇద్దరు సభ్యుల బృందం ఇచ్చే నివేదికపైనే కళాశాల భవితవ్యం ఆధారపడి ఉంది.