సీబీఎస్‌ఈ రీవాల్యుయేషన్‌ ఫలితాల వెల్లడి  | CBSE announces Class 12 re-evaluation results | Sakshi
Sakshi News home page

సీబీఎస్‌ఈ రీవాల్యుయేషన్‌ ఫలితాల వెల్లడి 

Jun 22 2026 4:51 AM | Updated on Jun 22 2026 4:51 AM

CBSE announces Class 12 re-evaluation results

న్యూఢిల్లీ: 12వ తరగతి బోర్డు పరీక్షల జవాబు పత్రాల వెరిఫికేషన్, రీ–వాల్యుయేషన్‌ ఫలితాలను సీబీఎస్‌ఈ ఆదివారం విడుదల చేసింది. మొదటి విడతలో భాగంగా మొత్తం దరఖాస్తుల్లో 87 శాతానికి పైగా ఫలితాలను ప్రకటించినట్లు తెలిపింది. విడతల వారీగా మిగతా దరఖాస్తుల ఫలితాలను కూడా వెల్లడిస్తామని, మొత్తం ప్రక్రియ కూడా తొందరలోనే ముగియనుందని ఎక్స్‌లో ప్రకటించింది. విద్యార్థులు తమ ఫలితాలను సీబీఎస్‌ఈ అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని తెలిపింది. రీ వాల్యుయేషన్‌ను పక్కాగా చేపట్టామని, ఈ విషయంలో వచ్చే వదంతులను నమ్మవద్దని కోరింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement