breaking news
class 12 results
-
విద్యార్థిగా మారిన మోస్ట్ వాంటెడ్ నక్సల్.. చరిత్ర సృష్టించింది
వయసు పదిహేను ఏళ్లే. కానీ మోస్ట్ వాంటెడ్ నక్సలైట్. కొండకోనలే ఆవాసాలు. మారణాయుధాలతో సహవాసం. అయితే ఆమెలో ప్రస్తుతం మార్పు వచ్చింది. గన్లను వదిలి పుస్తకాలు, పెన్‌లను చేతబూనింది.. చదువుల్లో రాణించింది. ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించి చరిత్ర సృష్టించింది. ఇంతకు ఆమెలో ఇంత మంచి మార్పు ఎలా వచ్చింది. ఇందుకు కారణాలేంటో తెలుసుకుందాం. మహారాష్ట్రలోని గోండియాకు చెందిన ఇరావుల హిందుజ తండ్రి.. చిన్నతనంలోనే మరణించాడు. తల్లి మరో వ్యక్తిని వివాహమాడి వెళ్లిపోయింది. ఒంటరైన ఈమెను ఎవరూ దగ్గరికి తీయలేదు. దీంతో తాను నక్సలిజంలో చేరిపోయింది. ఒడిశాలోని గడ్చిరోలి, మహారాషష్ట్రలోని గోండియా ప్రాంతాల్లో మోస్ట్ వాంటెడ్ హిట్ లిస్టులో చేరింది. పేరుమోపిన నక్సలైట్‌గా మారింది. పదిహేనేళ్లలోనే హిందుజపై ఆరు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి, అయితే గోండియా ప్రాంతానికి నూతనంగా బాధ్యతలు చేపట్టిన పోలీసు అధికారి ఎస్పీ సందీప్ అతోల్ ఈ విశయంపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఆవిడను సరైన దిశగా మార్చడంలో విజయం సాధించారు. 2018లోనే ఎస్పీ సలహాతో అటవి మార్గం విడిచి, జనావాసాలను చేరింది. పోలీసు అధికారి సందీప్ అతోల్ మద్దతుతో చదువును కొనసాగించింది. ప్రస్తుతం ఇంటర్లో 45.83 శాతంతో ఉత్తీర్ణత సాధించింది. సందీప్ అతోల్ కుటుంబమే తన కుటుంబమని అంటోంది. భవిష్యత్‌లో పోలీసు ఉద్యోగం సాధిస్తానని చెబుతోంది. సమస్యల పరిష్కారానికి అటవి దారి ఒక్కటే మార్గం కాదని తెలిపింది. చదవండి: సివిల్స్ ఫలితాల్లో ఇద్దరికి ఓకే ర్యాంకు, రోల్ నెంబర్.. నాదంటే.. నాది.. చివరికి! -
ఇంటర్లో పాసైంది 36 శాతం మందే!!
గతంలో బిహార్‌లో వెలుగుచూసిన టాపర్ల స్కాం ప్రభావం ఈసారి గట్టిగానే కనిపించింది. బిహార్ బోర్డు పరీక్షలలో ఇన్నాళ్లూ భారీ మొత్తంలో లంచాలు ఇవ్వడం ద్వారా మార్కులు సంపాదించిన విద్యార్థులు.. ఈసారి ఉన్నతాధికారులు కఠినంగా వ్యవహరించడంతో తేలిపోయారు. ఈ సంవత్సరం నిర్వహించిన 12వ తరగతి (ఇంటర్) పరీక్షలలో కేవలం 36 శాతం మాత్రమే ఉత్తీర్ణులయ్యారు.. 64 శాతం మంది ఫెయిలయ్యారు. పరీక్ష దరఖాస్తులను నింపే దగ్గర నుంచి పేపర్లు దిద్దేవరకు అన్ని అంశాల్లోను చాలా కఠినంగా వ్యవహరించామని, పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకున్నామని, ఆన్సర్ షీట్ల బార్‌కోడింగ్ ఉపయోగించి ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా చూసుకున్నామని బిహార్ పరీక్షల బోర్డు చైర్మన్ ఆనంద్ కిషోర్ తెలిపారు. దాంతో అక్కడి విద్యార్థుల బండారం బటయపడింది. కేవలం 36 శాతం మంది మాత్రమే పాసయ్యారు. 12వ తరగతి పరీక్షలలో సైన్స్, కామర్స్, ఆర్ట్స్ అన్ని విభాగాల్లో కలిపి మొత్తం 12,40,168 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, వారిలో 7,94,622 మంది ఫెయిలయ్యారు. కామర్స్‌లో అత్యల్పంగా 25 శాతం మంది ఫెయిలైతే, అత్యధికంగా సైన్స్ స్ట్రీమ్‌లో 69.52 శాతం మంది ఫెయిలయ్యారు. అలాగే ఈసారి టాపర్ల మార్కులు కూడా మరీ ఎక్కువగా ఏమీ రాలేదు. సైన్స్ విభాగంలో 500కు గాను 431 మార్కులు (86.2 శాతం) సాధించిన ఖుష్బూ కుమారికి మొదటి ర్యాంకు వచ్చింది. కామర్స్ విభాగంలో 500కు 408 మార్కులు (81.6 శాతం) సాధించిన ప్రియాన్షు జైస్వాల్, ఆర్ట్స్ విభాగంలో 500కు 413 (82.6 శాతం) సాధించిన గణేష్ కుమార్ మొదటి ర్యాంకులు సాధించారు. టాపర్లందరి పేపర్లను మరోసారి నిపుణుల సమక్షంలో రీవాల్యుయేషన్ చేశారు. ఆ తర్వాత మాత్రమే ఫలితాలు ప్రకటించారు. ఈసారి టాపర్లుగా నిలిచిన వారికి నగదు బహుమతులు, ల్యాప్‌టాప్‌లు ప్రకటించారు. మొదటి ర్యాంకు వస్తే రూ. 1 లక్ష, రెండో ర్యాంకు వస్తే రూ. 75 వేలు, మూడో ర్యాంకు వస్తే రూ. 50 వేలు, నాలుగో ర్యాంకు, ఐదో ర్యాంకు వస్తే రూ. 10 వేల వంతున ఇవ్వడంతో పాటు మొదటి ఐదు ర్యాంకులకు ల్యాప్‌టాప్‌లు ఇస్తున్నారు.