Nagpur: Wanted Naxal Girl Turned Student Passes 12th Class - Sakshi
Sakshi News home page

మోస్ట్ వాంటెడ్ నక్సల్‌.. గన్ వదిలి పుస్తకం పట్టింది.. చరిత్ర సృష్టించింది

May 26 2023 8:50 PM | Updated on May 26 2023 9:13 PM

Nagpur: Wanted Naxal Girl Turned Student Passes 12th Class - Sakshi

వయసు పదిహేను ఏళ్లే. కానీ మోస్ట్ వాంటెడ్ నక్సలైట్. కొండకోనలే ఆవాసాలు. మారణాయుధాలతో సహవాసం. అయితే ఆమెలో ప్రస్తుతం మార్పు వచ్చింది. గన్‍లను వదిలి పుస్తకాలు, పెన్‌లను చేతబూనింది.. చదువుల్లో రాణించింది. ఇంటర్‌ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించి చరిత్ర సృష్టించింది. ఇంతకు ఆమెలో ఇంత మంచి మార్పు ఎలా వచ్చింది. ఇందుకు కారణాలేంటో తెలుసుకుందాం.

మహారాష్ట్రలోని గోండియాకు చెందిన ఇరావుల హిందుజ తండ్రి.. చిన్నతనంలోనే మరణించాడు. తల్లి మరో వ్యక్తిని వివాహమాడి వెళ్లిపోయింది. ఒంటరైన ఈమెను ఎవరూ దగ్గరికి తీయలేదు. దీంతో తాను నక్సలిజంలో చేరిపోయింది. ఒడిశాలోని గడ్చిరోలి, మహారాషష్ట్రలోని గోండియా ప్రాంతాల్లో మోస్ట్ వాంటెడ్ హిట్ లిస్టులో చేరింది. పేరుమోపిన నక్సలైట్‍గా మారింది. పదిహేనేళ్లలోనే హిందుజపై ఆరు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి, 

అయితే గోండియా ప్రాంతానికి నూతనంగా బాధ్యతలు చేపట్టిన పోలీసు అధికారి ఎస్పీ సందీప్ అతోల్ ఈ విశయంపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఆవిడను సరైన దిశగా మార‍్చడంలో విజయం సాధించారు. 2018లోనే ఎస‍్పీ సలహాతో అటవి మార్గం విడిచి, జనావాసాలను చేరింది. పోలీసు అధికారి సందీప్ అతోల్ మద్దతుతో చదువును కొనసాగించింది. ప్రస్తుతం ఇంటర్‍లో 45.83 శాతంతో ఉత్తీర‍్ణత సాధించింది. సందీప్ అతోల్ కుటుంబమే తన కుటుంబమని అంటోంది. భవిష్యత్‌లో పోలీసు ఉద్యోగం సాధిస్తానని చెబుతోంది. సమస్యల పరిష్కారానికి అటవి దారి ఒక్కటే మార్గం కాదని తెలిపింది.
చదవండి: సివిల్స్‌ ఫలితాల‍్లో ఇద్దరికి ఓకే ర్యాంకు, రోల్ నెంబర్.. నాదంటే.. నాది.. చివరికి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement