బీఎస్‌ఎఫ్‌ అధికారిణి  నేహాకు పురస్కారం  | BSF Officer Felicitated For Exceptional Courage During Operation Sindoor | Sakshi
Sakshi News home page

బీఎస్‌ఎఫ్‌ అధికారిణి  నేహాకు పురస్కారం 

Jun 1 2025 5:17 AM | Updated on Jun 1 2025 12:16 PM

BSF Officer Felicitated For Exceptional Courage During Operation Sindoor

జమ్మూ: సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్‌)లో అసిస్టెంట్‌ కమాండెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న నేహా భండారీకి శుక్రవారం ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేదీ ప్రశంసా పురస్కారం అందజేశారు. ఇటీవల ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో జమ్మూ యుద్ధ క్షేత్రంలో నేహా అసమాన ధైర్య సాహసాలను, ఎంతో సమయస్ఫూర్తితో వ్యవహారించారని కొనియాడారు. 

అంతర్జాతీయ సరిహద్దుల్లోని పాకిస్తానీ పోస్ట్‌కు అత్యంత సమీప జీరో లైన్‌లోని బీఎస్‌ఎఫ్‌ పోస్టుకు సారథ్య బాధ్యతలు తీసుకున్న నేహా భండారీ..తన సహచరులను ప్రోత్సహిస్తూ శత్రువుకు చెందిన మూడు పోస్టులను నేలమట్టం చేసి, తగు గుణపాఠం చెప్పారని ఆయన అన్నారు. ఈ పోస్టులో నేహాతోపాటు ఆరుగురు మహిళా కానిస్టేబుళ్లున్నారు. వీరంతా ఏకమై అంతర్జాతీయ సరిహద్దుల్లోని అఖూ్నర్, సాంబ, ఆర్‌ఎస్‌పురా సెక్టార్ల వెంబడి ఉన్న శత్రువును తీవ్రంగా దెబ్బతీశారు. ఉత్తరాఖండ్‌కు చెందిన నేహాది ఆర్మీ నేపథ్యమున్న కుటుంబం. ‘మా తాత ఆర్మీలో పనిచేశారు. మా అమ్మానాన్న కూడా సీఆర్‌పీఎఫ్‌లో పనిస్తున్నారు’అని నేహా చెప్పారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement