లిక్కర్‌ స్కాం: మరోసారి కోర్టుకు కవిత.. బెయిల్‌ వచ్చేనా? | BRS MLC Kavitha Default Bail Petition Filed In Rouse Avenue Court | Sakshi
Sakshi News home page

లిక్కర్‌ స్కాం: మరోసారి కోర్టుకు కవిత.. బెయిల్‌ వచ్చేనా?

Jul 8 2024 2:59 PM | Updated on Jul 8 2024 3:25 PM

BRS MLC Kavitha Default Bail Petition Filed In Rouse Avenue Court

సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో సీబీఐ కేసులో డిఫాల్ట్‌ బెయిల్‌ కోరుతూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత.. రౌస్‌ అవెన్యూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో, ఈ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది.

కాగా, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో బెయిల్‌ విషయమై మరో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసులో డిఫాల్ట్‌ బెయిల్‌ కోరుతూ కవిత సోమవారం రౌస్‌ అవెన్యూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో గురువారంలోగా కౌంటర్‌ దాఖలు చేయాలని సీబీఐని కోర్టు ఆదేశించి​ంది. ఈ క్రమంలో డిఫాల్ట్‌ బెయిల్‌పై రౌస్‌ అవెన్యూ కోర్టు శుక్రవారం విచారణ చేపట్టనుంది. మరోవైపు.. లిక్కర్‌ స్కాం కేసులో కవిత పాత్రపై సీబీఐ దాఖలు చేసిన ఛార్జీషీట్‌ను పరిగణలోకి తీసుకునే అంశంపై కూడా కోర్టు విచారణ చేపట్టనుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement