న్యూఢిల్లీ: ప్రఖ్యాత బోయింగ్ సంస్థ తమ బీ737 మ్యాక్స్ రకం విమానాల్లో సాఫ్ట్‌వేర్ సమస్యను గుర్తించినట్లు తెలిసింది. ఈ సమస్య వల్ల ల్యాండింగ్ ప్రయత్నం విఫలమైన తర్వాత ఆటోమేటెడ్ ఫ్లైట్ గైడెన్స్ సిస్టమ్ నిలిచిపోయే అవకాశం ఉంది. సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి బోయింగ్ సంస్థ కృషి చేస్తోంది. ఇండియాలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఆకాశ ఎయిర్ సంస్థలు దాదాపు బీ737 మ్యాక్స్ రకం 96 విమానాలను నడిపిస్తున్నాయి.
సాఫ్ట్‌వేర్ సమస్యను సమస్యను పరిష్కరించడానికి తమ ఇంజనీర్లు ఒక సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌పై పనిచేస్తున్నారని బోయింగ్ ప్రతినిధి ఆదివారం వెల్లడించారు. బోయింగ్ సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నామని ఆకాశ ఎయిర్ ప్రతినిధులు వెల్లడించారు. ప్రస్తుతానికి తమ సంస్థ కార్యాకలాపాలపై ఎలాంటి ప్రభావం లేదని అన్నారు. సాఫ్ట్‌వేర్ సమస్య కారణంగా తమ బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల్లో ఏవైనా ప్రభావితమయ్యాయా అనే విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించలేదు.


