శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టులో తప్పిన పెను ప్రమాదం | Indigo Plane Hits Pole While Landing At Srinagar Airport | Sakshi
Sakshi News home page

శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టులో తప్పిన పెను ప్రమాదం

Sep 4 2026 11:14 AM | Updated on Sep 4 2026 11:45 AM

Indigo Plane Hits Pole While Landing At Srinagar Airport

శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టులో పెను ప్రమాదం తప్పింది.. ఎయిర్‌పోర్టులోని స్తంభాన్ని ఇండిగో విమానం ఢీకొట్టింది. పార్కింగ్‌చేస్తుండగా ఘటన జరిగింది. విమానం ముందు భాగం దెబ్బతింది. సిబ్బంది, ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

నవి ముంబై నుంచి శ్రీనగర్‌కు వెళ్తున్న ఇండిగో విమానం శుక్రవారం ఉదయం 9:02 గంటలకు శ్రీనగర్ విమానాశ్రయంలో పార్కింగ్ చేస్తుండగా ఘటన చోటుచేసుకుంది. విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ప్రయాణికులను మాన్యువల్ మెట్లను ఉపయోగించి సురక్షితంగా విమానం నుంచి దించినట్లు ఇండిగో తెలిపింది.

ఈ ఘటనపై ఎయిర్‌పోర్టు అధికారులు దర్యాప్తు చేపట్టారు. విచారణ అనంతరం ప్రమాదానికి అసలు కారణాలను నిర్ధారిస్తామని అధికారులు తెలిపారు. ఈ ఘటన అనంతరం కూడా శ్రీనగర్ విమానాశ్రయంలో కార్యకలాపాలు సాధారణంగానే కొనసాగాయి. విమానాల రాకపోకలు షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతున్నాయని ఇండిగో తెలిపింది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement