సీఎం ఇంటి దగ్గర క్షుద్ర పూజలు | Black Magic Near CM DK Shivakumar House | Sakshi
Sakshi News home page

సీఎం ఇంటి దగ్గర క్షుద్ర పూజలు

Jun 8 2026 8:06 AM | Updated on Jun 8 2026 12:42 PM

 Black Magic Near CM DK Shivakumar House

బెంగళూరు: సీఎం డీ.కే.శివకుమార్‌ బెంగళూరు సదాశివనగరలోని నివాసం దగ్గరలో క్షుద్ర పూజలు జరగడం కలకలానికి కారణమైంది. ఆయన నివాసానికి వెనుకవైపు జీబీఏ మైదానం ముందున్న రోడ్డులో శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వృత్తాకార ముగ్గులు వేసి, కోడిని కోసి, నిమ్మకాయలు పెట్టి పూజలు చేశారు. 

ఆదివారం ఉదయం ఇది చూసి స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఎంతోమంది వీఐపీలు నివసించే ప్రాంతంలో ఇలాంటిది జరిగింది.స్థానిక పోలీసులు చేరుకుని కోడి, ఇతర వస్తువులను తొలగించారు. సమీపంలోనే ముఖ్యమంత్రి నివాసముండటంతో ఈ ప్రదేశంలో భారీ పోలీస్‌ భద్రత ఉంటుంది. అయినప్పటికీ ఎలా క్షుద్రపూజలు జరిగాయి అనేది చర్చనీయాంశమైంది. పూజలు చేసినవారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement