బెంగళూరులో దారుణం.. వాకింగ్‌ చేస్తున్న మహిళపై లైంగిక వేధింపులు | Bengaluru Woman Incident Full Details Video Viral | Sakshi
Sakshi News home page

బెంగళూరులో దారుణం.. వాకింగ్‌ చేస్తున్న మహిళపై లైంగిక వేధింపులు

Apr 7 2025 7:47 AM | Updated on Apr 7 2025 10:26 AM

Bengaluru Woman Incident Full Details Video Viral

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తి ఒక మహిళపై  లైంగిక వేధింపులకు పాల్పడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.

వివరాల ప్రకారం... బెంగళూరులోని బీటీఎం లేఅవుట్‌లో గురువారం తెల్లవారుజామున ఇద్దరు మహిళలు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు. వారు నడుస్తున్న వీధి నిర్మానుష్యంగా ఉంది. ఈ క్రమంలో ఓ వ్యక్తి వారి వద్దకు వచ్చాడు. వారిలో ఓ మహిళను లైంగిక వేధింపులకు గురిచేశాడు. దీంతో, మరో మహిళ.. అతడిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. అనంతరం, సదరు ఆగంతకుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.

అయితే, ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి ఫిర్యాదులు రాలేదని స్థానిక పోలీసులు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి బాధితురాలు ముందుకు రాలేదని చెప్పుకొచ్చారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా తామే స్వయంగా చర్య తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా.. బెంగళూరులో మహిళలపై లైంగిక వేధింపుల సాధారణంగా మారాయి. ఈ ఏడాది జనవరిలో బెంగళూరులో ఓ యువతి వేధింపులకు గురైంది. ఆమె బుక్ చేసుకున్న క్యాబ్‌లోకి బలవంతంగా ప్రవేశించిన ఇద్దరు వ్యక్తులు ఆమెను వేధించారని ఆరోపించారు. కమ్మనహళ్లి నివాసి అయిన ఆ మహిళ ఏదో విధంగా తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. జనవరి 27న తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఆ మహిళ తన స్నేహితుడిని తీసుకెళ్లడానికి క్యాబ్ బుక్ చేసుకున్నప్పుడు ఈ ఘటన జరిగింది. ఆ మహిళ భయంతో క్యాబ్ నుంచి దిగాలని నిర్ణయించుకున్నప్పుడు నిందితుల్లో ఒకరు ఆమెను వెంబడించాడు. మరొకరు ఆమె బట్టలు చింపడానికి ప్రయత్నించారు. ఆ మహిళ సహాయం కోసం కేకలు వేయడంతో నిందితుడు పారిపోయాడు.

Advertisement
 
Advertisement
Advertisement