పెళ్లైన ఆటో డ్రైవర్‌తో సహజీవనం.. చివరికి విషాదం..! | bengaluru woman bhavana incident | Sakshi
Sakshi News home page

పెళ్లైన ఆటో డ్రైవర్‌తో సహజీవనం.. చివరికి విషాదం..!

Jun 15 2026 7:54 AM | Updated on Jun 15 2026 2:12 PM

bengaluru woman bhavana incident

బెంగళూరు:  యువతితో సహజీవనం చేస్తూ ఆమెను గొంతు నులిమి కడతేర్చిన ఆటో డ్రైవర్‌ ఉదంతం బ్యాడరహళ్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. చిక్కగొల్లరహట్టి నివాసి చంద్రశేఖర్‌కు వివాహమై కుమారుడు ఉన్నాడు. ఇతను ఆటోడ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో తిగరపాళ్యలో సెల్‌ఫోన్‌ షోరూమ్‌లో పనిచేస్తున్న  మాగడి ప్రాంతానికి చెందిన భవానీ(22) అనే యువతి ఆటోలో ఎక్కిన సమయంలో పరిచయం ఏర్పడి ప్రేమకు దారితీసింది. 

పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెతో తిరగపాళ్యలోని అద్దె ఇంటిలో సహజీవనం చేస్తున్నాడు. అయితే చంద్రశేఖర్‌కు పెళ్లయ్యిందని తెలియడంతో  అతన్ని దూరం పెట్టింది. మరో వైపు ఆమెకు తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఇకపై తనవద్దకు రావద్దని భవానీ చంద్రశేఖర్‌కు సూచించింది. దీంతో ఈ నెల 12న  ఇరువురి మధ్య గొడవ జరిగింది.

 దీంతో చంద్రశేఖర్‌ ఆమెకు విషం తాపించి తానూ తాగాడు. అనంతరం భవానీ గొంతునులిమి ఊపిరాడకుండా చేసి హత్యచేశాడు. అనంతరం తమ ఇద్దరి ఫొటోలను ఇన్‌స్టాలో అప్‌లోడ్‌ చేసి వివాహవార్షికోత్సవం అని  పోస్ట్‌పెట్టాడు. గమనించిన భవాని కుటుంబసభ్యులు ఫోన్‌లో ఆమెను సంప్రదించడానికి ప్రయత్నించగా స్పందన లేకపోయింది. అనుమానం వచ్చి తిగరపాళ్యలకు వెళ్లి చూడగా భవానీ మృతి చెందింది. పోలీసులు వచ్చి  స్పృహలోలేని చంద్రశేఖర్‌ను ఆసుపత్రికి  తరలించారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement