Bihar: ఒకే కుటుంబానికి చెందిన నలుగురి ఊచకోత | Bihar's Begusarai Police Case Investigation | Sakshi
Sakshi News home page

Bihar: ఒకే కుటుంబానికి చెందిన నలుగురి ఊచకోత

Aug 10 2024 11:30 AM | Updated on Aug 10 2024 11:45 AM

Bihar's Begusarai Police Case Investigation

బీహార్‌లోని బెగుసరాయ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని గొంతుకోసి హత్య చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో భర్త, భార్య, కుమార్తె మృతి చెందగా, కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ దారుణానికి పాల్పడిన నేరస్తులు ఆ కుటుంబంలోని నలుగురిపైన యాసిడ్ కూడా పోశారు. గాయపడిన కుమారుని పరిస్థితి విషమంగా  ఉంది.

బచ్వారా పోలీస్ స్టేషన్ పరిధిలోని రషీద్‌పూర్‌లోని చిరంజీవిపూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఈ ప్రాంతానికి చెందిన సంజీవన్ మహతో తన కుటుంబ సభ్యులందరితో పాటు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. నేరస్తులు పదునైన ఆయుధంతో సంజీవన్ మహతోను ఆయన భార్య సంజితా దేవి, కుమారుడు అంకుష్‌కుమార్‌, కుమార్తె సప్నా కుమారిల గొంతు కోశారు. ఈ ఘటనలో భర్త, భార్య, కుమార్తె అక్కడికక్కడే మృతి చెందారు. కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు.  అంకుష్‌కుమార్‌ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న బచ్వారా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంజీవన్ మహతోకు ఇద్దరు భార్యలు ఉన్నారని పోలీసులు తెలిపారు. కుటుంబ విభేదాల కారణంగానే ఈ ఘోరం జరిగివుంటుందని పోలీసులు భావిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement