ఆనంద డోలికల్లో అరుణ్‌ యోగిరాజ్‌ తల్లి | Arun Yogiraj Mother Saraswathi Happy | Sakshi
Sakshi News home page

Karnataka: ఆనంద డోలికల్లో అరుణ్‌ యోగిరాజ్‌ తల్లి

Jan 2 2024 10:56 AM | Updated on Jan 2 2024 10:56 AM

Arun Yogiraj Mother Saraswathi Happy - Sakshi

కర్ణాటకకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ తీర్చిదిద్దిన శ్రీరాముని విగ్రహాన్ని అయోధ్యలోని నూతన రామాలయంలో ప్రతిష్ఠించనున్నారు. ఈ సందర్భంగా అరుణ్‌ యోగిరాజ్‌ తల్లి సరస్వతి మీడియాతో మాట్లాడారు. తన కుమారుడు తీర్చిదిద్దిన విగ్రహాన్ని అయోధ్యలో ప్రతిష్ఠాపనకు ఎంపిక చేయడం ఎంతో సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు. అయితే తన కుమారుడు శ్రీరాముని విగ్రహాన్ని తయారు చేస్తుండగా, తాను చూడలేకపోయానని ఆమె తెలిపారు. 

తన కుమారుడు శ్రీరాముని శిల్పాన్ని తయారు చేస్తున్నప్పుడు.. విగ్రహం తయారీ చివరి రోజున చూపిస్తానని చెప్పాడన్నారు. తన కుమారుడు సాధించిన ఈ విజయానికి చాలా సంతోషంగా ఉందని, అయితే ఈ విజాయానందాన్ని పంచుకునేందుకు తన భర్త ఇప్పుడు జీవించి లేరని ఆమె తెలిపారు. 
ఇది కూడా చదవండి: అయోధ్యలో కొలువుదీరే శ్రీరాముని విగ్రహం ఇదే!

Advertisement
 
Advertisement
Advertisement