Mahakumbh-2025: తొక్కిసలాట అనంతరం సీఎం యోగి వినతి | Maha Kumbh Mela 2025: After The Stampede CM Yogi Appealed To The Devotees To Bathe At The Closest Ghats | Sakshi
Sakshi News home page

Maha Kumbh Mela 2025: తొక్కిసలాట అనంతరం సీఎం యోగి వినతి

Jan 29 2025 8:54 AM | Updated on Jan 29 2025 9:32 AM

After the Stampede CM Yogi Appealed to the Devotees

ప్రయాగ్‌రాజ్‌: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా జరుగుతోంది. మౌని అమావాస్య సందర్భంగా పుణ్య స్నానాలు చేసేందుకు ఈరోజు(బుధవారం) సంగమ తీరానికి లేక్కలేనంతమంది భక్తులు వచ్చారు. ఈ నేపధ్యంలో తొక్కిసలాట చోటుచేసుకుంది.

ఈ ఘటన గురించి తెలియగానే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అధికారులను అప్రమత్తం చేశారు. అలాగే సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. దీనితో పాటు భక్తులకు ఒక విజ్ఞప్తి చేశారు. యూపీ సర్కారు కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు పలు ఘాట్లను నిర్మించిందని తెలిపారు. అక్కడ  కూడా స్నానాలు చేయవచ్చని సూచించారు. పుణ్యస్నానాల సందర్భంగా ఎటువంటి వదంతులు వ్యాపించినా పట్టించుకోవద్దని కోరారు.

మరోవైపు  ఈరోజు ఉదయం తొక్కిసలాట  చోటుచేసుకున్న కారణంగా అన్ని అఖాడాలు అమృత స్నానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. దీనిని నిరంజన్ కంటోన్మెంట్ అఖాడ పరిషత్ అధ్యక్షుడు శ్రీమహంత్ రవీంద్ర గిరి మీడియాకు తెలిపారు. తొక్కిసలాటలో కొందరు మహిళలు, పిల్లలు గాయపడ్డారని తెలుస్తోంది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని అధికారులు చెబుతున్నారు. 

ఇది కూడా చదవండి: Mahakumbh-2025: యూపీ, బీహార్‌ సరిహద్దుల్లో భారీ ట్రాఫిక్‌ జామ్‌.. 70 కి.మీ. పొడవునా..

Advertisement
 
Advertisement
Advertisement