మమత ఎక్స్‌ హ్యాండిల్‌ తొలగించినా ఆశ్చర్యం లేదు | Abhijeet Dipke after post thanking Mamata was restricted | Sakshi
Sakshi News home page

మమత ఎక్స్‌ హ్యాండిల్‌ తొలగించినా ఆశ్చర్యం లేదు

Oct 4 2026 5:28 AM | Updated on Oct 4 2026 5:28 AM

Abhijeet Dipke after post thanking Mamata was restricted

అభిజీత్‌ దీప్కే వ్యాఖ్య 

టీఎంసీ ఎంపీ పోస్టు తొలగింపుపై స్పందన 

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కృతజ్ఞతలు చెబుతూ తాను ఎక్స్‌ పోస్టు పెట్టిన నేపథ్యంలో ఇంకో వారం రోజుల్లో ఆమె ఎక్స్‌ హ్యాండిల్‌ను నిర్వీర్యం చేసినా ఆశ్చర్యపోనవసరం లేదని కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే వ్యాఖ్యానించారు. సీఈసీకి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనను సమర్థిస్తూ మమత ఎక్స్‌లో ఒక పోస్టు చేయగా దీప్కే స్పందిస్తూ .. కాక్రోచ్‌ జనతా పార్టీకి మద్దతిస్తున్నందుకు కృతజ్ఞతలు.

 ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం భారతీయులందరూ కదలి రావాల్సిన సమయమిది అంటూ సమాధానమిచ్చారు. దీప్కే చేసిన ఎక్స్‌ పోస్టును టీఎంసీ రాజ్యసభ సభ్యుడు డెరెక్‌ ఒబ్రెయిన్‌ షేర్‌ చేయగా కొంత సమయం తరువాత ఎక్స్‌ దాన్ని తొలగించింది. స్థానిక చట్టాల ప్రకారం ఈ కంటెంట్‌ను   నియంత్రిస్తున్నట్లు  ఎక్స్‌ ఆ పోస్టుపై సూచించింది. డెరెక్‌ ఒ బ్రెయిన్‌ దీనిపై ఎక్స్‌లో ఇంకో పోస్టు ప్రభుత్వం బెదిరి పోయినందునే ఎక్స్‌ పోస్టులను తొలగించేలా చేస్తోందని ఆరోపించారు.

 ప్రతిగా అక్టోబర్‌ పది లోపు మమతా బెనర్జీ ఎక్స్‌ హ్యాండిల్‌ను నిర్వీర్యం చేసినా  ఆశ్చర్యపోవాల్సిన   అవసరం లేదని దీప్కే వ్యాఖ్యానించారు. ఇండియా కూటమి సమావేశాలకు హాజరై తిరిగి కోల్‌కతా చేరుకున్న మమత విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడుతూ ‘‘కాక్రోచ్‌ జనతా పార్టీకి, యువతరానికి, విద్యార్థులకు పూర్తిగా మద్దతిస్తున్నాం’’అని వ్యాఖ్యానించారు. జూలై నెలలో ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో జరిగిన ఆందోళనలకూ మమత తన మద్దతిచ్చిన విషయం తెలిసిందే.   
    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement