2014-22 మధ్య ఆప్‌ రూ. 7.08 కోట్ల విదేశీ నిధులను పొందింది: ఈడీ | Sakshi
Sakshi News home page

2014-22 మధ్య ఆప్‌ రూ. 7.08 కోట్ల విదేశీ నిధులను పొందింది: ఈడీ

Published Mon, May 20 2024 5:05 PM

AAP received Rs 7.08 crore foreign funds from 2014-2022: ED

న్యూఢిల్లీ: 2014 నుంచి 2022 కాలంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ రూ. 7.08 కోట్ల విదేశీ నిధులను పొందినట్లు దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సోమవారం హోంమంత్రిత్వశాఖకు తెలిపింది.  విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (FCRA), ప్రజా ప్రాతినిధ్య చట్టం(RPA), ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ (IPC) నిబంధనలను ఆప్‌‌ ఉల్లంఘించించి.. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్‌, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్‌, ఒమన్‌  కెనడా సహా వివిధ దేశాల్లో ఉన్న దాతల నుంచి ఆప్‌ ఈ మొత్తాన్ని స్వీకరించినట్లు ఈడీ వెల్లడించింది. 

అయితే విదేశీ దాతల వివరాలతోపాటు విరాళాలకు సంబంధించిన అనేక వాస్తవాలను ఈప్‌ దాచిపెట్టిందని ఈడీ ఆరోపించింది. దాతల వివరాలను తప్పుగా  ప్రకటించడం, తారుమారు చేయడం ద్వారా ఈ  మొత్తాన్ని సేకరించినట్లు  పేర్కొంది. ఆప్‌, పార్టీ నేతలు విదేశీ నిధుల సేకరణలో అనేక అవకతవకలకు పాల్పడినట్లు తన దర్యాప్తుల్లో వెల్లడైందని ఆప్‌ తెలిపింది. 

అంతేగాక 2016లో  కెనాడాలో నిధుల సేకరణ కార్యక్రమంలో సేకరించిన నిధులను, ఆప్‌ ఎమ్మెల్యే దుర్గేష్‌ పాఠక్‌తో సహా పలువురు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకున్నట్లు ఆరోపించింది. అనికేత్ సక్సేనా (ఆప్‌ ఓవర్సీస్ ఇండియా కోఆర్డినేటర్), కుమార్ విశ్వాస్ (ఒకప్పటి ఆప్‌ ఓవర్సీస్ ఇండియా కన్వీనర్), కపిల్ భరద్వాజ్ (అప్పటి  ఆప్‌ సభ్యుడు), దుర్గేష్‌తో సహా వివిధ పార్టీ వాలంటీర్లు, కార్యనిర్వాహకుల మధ్య జరిగిన ఇ-మెయిల్‌లలోని విషయాల ద్వారా  ఈ విషయాలు బయటపడినట్లు దర్యాప్తు సంస్థ పేర్కొంది.

Advertisement
 
Advertisement
 
Advertisement