
చెరువులోకి దూకి తల్లిదండ్రులు, కుమార్తె ఆత్మహత్య
మైసూరు(కర్ణాటక): కూతురు ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోయిందని తల్లిదండ్రులు సహా ముగ్గురు చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన మైసూరు జిల్లాలోని హెచ్‌డి కోటె తాలూకాలోని బూదనూరు గ్రామంలో జరిగింది. మహాదేవస్వామి, భార్య మంజుల, వీరి చిన్న కుమార్తె హర్షిత మృతులు.
మహాదేవస్వామిపెద్దకుమార్తె హర్షిత రెండురోజుల క్రితం ప్రియునితో కలిసి ఎక్కడికో వెళ్లిపోయింది. గ్రామంలో తల ఎత్తుకోలేకపోయామని తల్లిదండ్రులు, చెల్లెలు ఆవేదనకు లోనయ్యారు. శనివారం గ్రామ సమీపంలోని చెరువులోకి దూకారు. చెరువు కట్టపై బైక్, చెప్పులు ఉండడంతో గ్రామస్తులు వెళ్లి చూడగా ఏమీ కనిపించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయగా ఫైర్ సిబ్బందితో వచ్చి చెరువులో గాలించగా ముగ్గురి మృతదేహాలు బయటపడ్డాయి.