వేటగాళ్లపై నజర్‌..! | - | Sakshi
Sakshi News home page

వేటగాళ్లపై నజర్‌..!

Oct 1 2026 4:52 AM | Updated on Oct 1 2026 4:52 AM

న్యూస్‌రీల్‌

కృష్ణజింకల భద్రతే లక్ష్యం..

వేటగాళ్లు వస్తున్నారా?

గురువారం శ్రీ 1 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

–8లో u

నారాయణపేట: పచ్చటి పొలాల మధ్య స్వేచ్ఛగా సంచరించే కృష్ణజింకల భద్రతే అధికారులకు ప్రథమ ప్రాధాన్యంగా మారింది. ఇటీవల వెలుగు చూసిన వేట ఘటనతో అప్రమత్తమై జింకల సంచార ప్రాంతాలపై నిఘాను విస్తరించే దిశగా అడుగులు వేస్తున్నారు. వేటగాళ్ల కదలికలకు తావులేకుండా జల్లెడ పడుతున్నారు. బుధవారం ఊట్కూర్‌ మండలంలోని నిడుగుర్తి, లక్ష్మీపల్లి, ఊట్కూర్‌ పెద్దచెరువు శివారు ప్రాంతాలతో పాటు నర్వ మండలం రాయికోడ్‌ శివారును సందర్శించారు. కృష్ణజింకల సంచారం, ఆయా ప్రాంతాల పరిస్థితిపై స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

ఊట్కూర్‌ మండలం నిడుగుర్తి–లక్ష్మీపల్లి శివారులో కృష్ణజింకల సంచారం అధికంగా ఉండటంతో వేటగాళ్ల కదలికలపై అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ డీఎఫ్‌ఓ గణేష్‌ గుండు ఆధ్వర్యంలో నారాయణపేట ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి కమాలుద్దీన్‌, సెక్షన్‌ అధికారి సత్యనారాయణ, ఎఫ్‌బీఓ సంతోష్‌ బుధవారం మరోసారి ఘటన జరిగిన ప్రాంతంతో పాటు జింకలు సంచరించే పరిసరాలను నిశితంగా సందర్శించి పరిశీలించారు.

విస్తృత నిఘా..

కృష్ణజింకల వేట ఘటన నేపథ్యంలో అటవీశాఖ నిఘా మరింత పెంచింది. సాధారణ పర్యవేక్షణకే పరిమితం కాకుండా సంచరించే ప్రాంతాలను గుర్తించడం, వాటికి చేరుకునే మార్గాలపై ఆరా తీయడం, స్థానికుల నుంచి సమాచారాన్ని సేకరించడంపై అధికారులు దృష్టి సారించారు. జింకల సంచారం ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి విస్తరిస్తోంది? వాటి కదలికలకు అనుకూలమైన ప్రదేశాలేమిటి? అనే అంశాలను అధికారులు పరిశీలించారు. చెరువులు, పొలాలు, శివారు ప్రాంతాల్లో జింకల కదలికలు ఎలా ఉన్నాయి? వేటగాళ్లు ప్రవేశించేందుకు అవకాశం ఉన్న మార్గాలేమిటి? అనే అంశాలపై స్థానికుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.

కృష్ణజింకలు కేవలం అడవిలో కనిపించే వన్యప్రాణులు మాత్రమే కాదు.. ప్రకృతి సమతుల్యతలో భాగం. వాటి సంచార ప్రాంతాలను సురక్షితంగా ఉంచడం, వేటకు అవకాశం లేకుండా చేయడం, స్థానికుల్లో సంరక్షణ భావన పెంచడమే తమ లక్ష్యం.

– గణేష్‌, ఫ్లయింగ్‌ స్క్యాడ్‌ డీఎఫ్‌ఓ,

మహబూబ్‌నగర్‌

కృష్ణజింకల సంచార ప్రాంతాలపై అటవీశాఖ నిఘా కొనసాగించనుంది. ఘటన పునరావృతం కాకుండా అవసరమైన ప్రాంతాల్లో పర్యవేక్షణ పెంచడంతో పాటు స్థానికుల నుంచి వచ్చే సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుంటామని అధికారులు తెలిపారు. కృష్ణజింకల సంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వేటకు అవకాశం లేకుండా పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేయడం ఇప్పుడు ప్రధాన అంశంగా మారింది. అప్పటి వరకు జింకల సంచార ప్రాంతాల్లో అప్రమత్తతే రక్షణకు కీలకం.

కృష్ణజింకల భద్రతపై అటవీశాఖ ప్రత్యేక దృష్టి

వేట ఘటనతో అప్రమత్తం..

సంచార ప్రాంతాలపై నిఘా

ఊట్కూర్‌ నుంచి

రాయికోడ్‌ వరకు జల్లెడ

జింకల సంచార ప్రాంతాలపై

స్థానికులతో ఆరా

వేటగాళ్లు మళ్లీ ఆయా ప్రాంతాల్లోకి వస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాల కదలికలు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని స్థానికులకు సూచించారు. కృష్ణజింకలు సంచరించే ప్రాంతాల సమీపంలో వ్యవసాయ పొలాలు ఉండటంతో రైతులు, గ్రామస్తుల సహకారం కీలకంగా మారింది. వేటగాళ్లకు ఎలాంటి సహకారం అందించవద్దని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement