వయసు పెరిగిందని విరామం ఇవ్వొద్దు | - | Sakshi
Sakshi News home page

వయసు పెరిగిందని విరామం ఇవ్వొద్దు

Oct 2 2026 1:28 AM | Updated on Oct 2 2026 1:28 AM

నారాయణపేట: కొత్త విషయాలు నేర్చుకోడానికి వయసు అడ్డంకి కాదని.. ఆరోగ్యం కాపాడుకుంటూనే ఆర్థిక స్వావలంబన, నైపుణ్యాభివృద్ధి, నిరంతర విద్యపై దృష్టి సారించాలని కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక సూచించారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా గురువారం జిల్లా కేంద్రం సమీపంలోని సింగారం మలుపు వద్ద ఉన్న వృత్తి నైపుణ్యాభివృద్ధి కేంద్రంలో సెర్ప్‌ ఆధ్వర్యంలో వృద్ధుల కోసం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశా రు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. మహిళా స్వయం సహాయక సంఘాలు రాష్ట్రంలో విజయవంతంగా కొనసాగుతున్నాయని.. పొదు పు, బ్యాంకు లావాదేవీలు, రుణ సదుపాయాల ద్వారా మహి ళలు స్వావలంబన సాధిస్తున్నారని తెలిపారు. వృద్ధుల మహిళా స్వయం సహాయక సంఘాలు కేవలం పొదుపు, రుణ కార్యకలాపాలకే పరిమితం కాకుండా పరస్పర సహకారం, ఆత్మీయత, ఆరోగ్యం, పోషకాహారం, జీవన విధానంపై చర్చించు కునే వేదికలుగా మారాలని సూచించారు. కుట్టు, అ ల్లికలు వంటి తమకు తెలిసిన నైపుణ్యాలను మరింత అభివృద్ధి చేసుకుని అదనపు ఆదాయ మార్గాలను అన్వేషించాలని కోరారు. వయసు పెరిగిన త ర్వాత చదువు అవసరం లేదనే భావనను వీడాలని.. ఉల్లాస్‌ కార్యక్రమంలో భాగంగా నిర్వహించే పరీక్షల్లో వృద్ధ మహిళలు పాల్గొనాలని సూచించారు. పరీక్షలంటే భయపడాల్సిన అవసరం లేదని, కొత్త విషయాలు నేర్చుకోవడంతో అభ్యసన సామార్థ్యాలను పెంపొందించుకోవచ్చని తెలిపారు. సంఘాల సమావేశాలు క్రమం తప్పకుండా, చురుగ్గా నిర్వహించేలా సెర్ప్‌, డీపీఎం, డీఆర్డీఓ, ఏపీఎంలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్‌ వృద్ధుల వద్దకు వెళ్లి వారిని ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పింఛన్లు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. కార్యక్రమంలో డీఆర్డీఓ వెంకట్రాములు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డా. సిద్ధప్ప, సెర్ప్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్‌ బాలస్వామి, జిల్లా మహిళా సమాఖ్య అధ ్యక్షురాలు అరుంధతి, కోశాధికారి అంజమ్మ, జోగిని వ్యవస్థ నిర్మూలన సంస్థ సభ్యురాలు హాజమ్మ, డీపీఎంలు గోవిందు, మాసన్న, వైద్యులు డా. నర్సింహారావు సగరి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement