ధాన్యం సేకరణకు సన్నద్ధం | - | Sakshi
Sakshi News home page

ధాన్యం సేకరణకు సన్నద్ధం

Oct 2 2026 1:28 AM | Updated on Oct 2 2026 1:28 AM

1.37 లక్షల ఎంటీఎస్‌

ధాన్యం కొనుగోలు లక్ష్యం..

గత సీజన్‌లో

1.40 లక్షల

ఎంటీఎస్‌ సేకరణ..

● జిల్లావ్యాప్తంగా 161 కేంద్రాలు ఏర్పాటు

● 1.37 లక్షల మెట్రిక్‌ టన్నుల

వరి సేకరణే లక్ష్యం

● 34.38 లక్షల సంచులకుగాను

15 లక్షలే అందుబాటులో..

● మూడోవారం నుంచే

నారాయణపేట: వానాకా లం పంటలు చేతి కొస్తున్న వేళ.. వరి ధాన్యం కొనుగోళ్లకు కలెక్టర్‌ సీ హెచ్‌ ప్రియాంక దిశానిర్ధేశంతో జిల్లా పౌరసరఫరాలశాఖ కసరత్తు ము మ్మరం చేసింది. జిల్లా వ్యాప్తంగా 1,50,825 ఎకరాల్లో వరి సాగుకాగా.. 3.61 లక్షల టన్నుల దిగుబడి రావచ్చని అధికారులు అంచనా వేశారు. కాగా.. ప్రభు త్వ కొనుగోలు కేంద్రాల ద్వారా 1,37,550 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇందుకోసం 13 మండలాల్లో 161 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. కాగా.. గన్నీ బ్యాగులు, తూకం, తేమ పరీక్ష, నాణ్యత పరిశీలనకు అవసరమైన పరికరాల కొరత సవాల్‌గా మారింది. 34.38 లక్షల గన్నీబ్యాగులు అవసరం కాగా..ప్రస్తుతం 15 లక్షలు మాత్రమే అందుబా టు లో ఉన్నాయి. రైతులు ధాన్యం తీసుకొచ్చే సమయా నికి ఏర్పాట్లు పూర్తిచేసి.. ఎక్కడా జాప్యం లే కుండా కొనుగోళ్లు సాగించాల్సిన అవసరం ఏర్పడింది.

13 మండలాలు.. 161 కేంద్రాలు

వరి ధాన్యం సేకరణకుగాను ఐకేపీ ఆధ్వర్యంలో 83, పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో 65, మెప్మా 6, ఎఫ్‌పీఓలకు 7 కొనుగోలు కేంద్రాలు 161 కేటాయించారు.మక్తల్‌, మాగనూర్‌, కృష్ణా మండలాల్లో ఈ నెల మూడో వారంలో నే ధాన్యం రాక ప్రారంభమ య్యే అవకాశం ఉండగా.. నా రాయణపేట, ధన్వాడ, మరికల్‌, ఊట్కూ ర్‌, నర్వలో నాలుగో వారం నుంచి వచ్చే అవకాశం ఉంది. దామరగిద్ద, మద్దూర్‌, కొత్తపల్లి, కోస్గి, గుండుమాల్‌ మండలాల్లో నవంబర్‌ రెండో వారం ఉంటాయని అధికారులు అంచనా వేశారు.

వెంటాడుతున్న పరికరాల కొరత..

ధాన్యం కొనుగోళ్లకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ కేంద్రాల్లో అవసరమైన పరికరాల కొరత వెంటాడుతోంది. టార్పాలిన్లు 4,830 అవసరం కాగా 2,761 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 161 ఆటోమేటిక్‌ ప్యాడీ క్లీనర్లకు 158 అందుబాటులో ఉండగా.. మరో 3 కావాలి. ధాన్యం నాణ్యత పరిశీలనకు ఉపయోగించే గ్రెయిన్‌ క్యాలిపర్స్‌ 44, హస్క్‌ రిమూవర్లు 44 తక్కువగా ఉన్నాయి. తేమ శాతం నిర్ధారించే పరికరాలు 161 అవసరం కాగా 153 మాత్రమే ఉన్నాయి. ఎలక్ట్రానిక్‌ వెయింగ్‌ స్కేల్స్‌ 161 అవసరం కాగా 138 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ధాన్యం ఆరబెట్టేందుకు అవసరమైన 3 డ్రయర్లు అందుబాటులో ఉన్నాయి.

ఈ ఏడాది వానాకాలంలో 1.37 లక్షల ఎంటీఎస్‌ వరి ధాన్యం కొనుగోలు లక్ష్యంగా జిల్లావ్యాప్తంగా 161 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో సన్నధాన్యం విక్రయించి మద్దతు ధరతో పాటు బోనస్‌ సైతం పొందాలని కోరుతున్నాం.

– సైదులు, జిల్లా పౌరసరఫరాలశాఖ డీఎం

కేంద్రాలకు చేరనున్న ధాన్యం

2025–26 వానాకా లం సీజన్‌లో జిల్లావ్యాప్తంగా 4.28 లక్షల మెట్రిక్‌ ట న్నుల ఉత్పత్తి అంచనా వేయగా.. స్థానిక వినియోగం, మిల్లర్ల కొనుగోళ్ల తర్వాత 2.10 లక్షల టన్నులు ప్రభుత్వ కొనుగోళ్లకు అవకా శం ఉందని అంచనా వేశారు. అయితే వాస్తవంగా 1,40, 266. 320 మెట్రిక్‌ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. ఈసారి 1.37 లక్షల టన్నుల కొనుగోళ్లను సకాలంలో పూర్తి చేయాలంటే కేంద్రాల్లో అవసరమైన పరికరాలు, గన్నీ సంచులను ముందుగానే సమకూర్చడం కీలకంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement