వయోవృద్ధులకు అండగా ఉంటాం | - | Sakshi
Sakshi News home page

వయోవృద్ధులకు అండగా ఉంటాం

Oct 2 2026 1:28 AM | Updated on Oct 2 2026 1:28 AM

నారాయణపేట: వయోవృద్ధులకు చట్టపరమైన సలహాలు, సూచనలు, న్యాయ సాయం అందించేందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్‌ఎస్‌ఏ) ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని సీనియర్‌ సివిల్‌ జడ్జి వింధ్యానాయక్‌ భరోసానిచ్చారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాకేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో గురువారం నిర్వహించిన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై వయోవృద్ధుల హక్కు లు, సంక్షేమం, వారికి అందుబాటులో ఉన్న న్యా యసాయంపై అవగాహన కల్పించారు. వయోవృద్ధులు రాజ్యాంగం, చట్టాలు కల్పించిన హక్కులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వయోవృద్ధులు ఆరోగ్యంగా, ఆనందంగా, గౌరవప్రదంగా జీవించేలా కుటుంబ సభ్యులు, సమాజం సహకరించాలని కోరారు. అనంతరం జిల్లా సంక్షేమశాఖ అధికారి రాజేందర్‌గౌడ్‌ మాట్లాడుతూ.. జిల్లాకేంద్రంలోని డే కేర్‌ సెంటర్‌లో వయోవృద్ధులకు రోజు భోజనం, అల్పాహారం అందిస్తున్నామని తెలిపారు. క్యారం, చెస్‌ తదితర క్రీడా సదుపాయాలు కూడా కల్పించినట్లు పేర్కొన్నారు. వయోవృద్ధుల కోసం ఓల్డ్‌ ఏజ్‌ హోమ్‌ అందుబాటులో ఉందని, అలాంటి వారిని గుర్తించి సంక్షేమశాఖకు సమాచారం ఇవ్వాలని కోరారు. పిల్లలు లేదా ఇతర కుటుంబ సభ్యులతో ఇబ్బందులు ఎదురైతే ఆర్డీఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని, చట్టపరమైన హక్కుల పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో క్షేత్రస్థాయి అధికారి సాయి, గుడ్‌ యూనివర్స్‌ ఎన్జీఓ ప్రతినిధులు, లయన్స్‌క్లబ్‌ చైర్మన్‌ రవికుమార్‌గౌడ్‌, సభ్యుడు ఆత్మారాం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement