భూ సమస్యల పరిష్కారానికే రీ–సర్వే | - | Sakshi
Sakshi News home page

భూ సమస్యల పరిష్కారానికే రీ–సర్వే

Oct 1 2026 4:52 AM | Updated on Oct 1 2026 4:52 AM

పుస్తకమే గొప్ప ఆయుధం..

మాగనూర్‌: రాష్ట ప్రభుత్వం రైతుల భూ సమస్యలను పరిష్కరించేందుకు రీ–సర్వే చేపడుతోందని.. సహకరించాలని కలెక్టర్‌ ప్రియాంక అన్నారు. బుధవారం మండలంలోని గజరందొడ్డిలో రీ–సర్వేపై నిర్వహించిన గ్రామసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సుమారు వంద ఏళ్లతర్వాత ప్రభుతం భూముల రీ–సర్వే చేపడుతుందని.. ఆన్‌లైన్‌లో నమోదు చేసి పట్టాదారు పాసు పుస్తకాలు అందజేస్తుందని తెలిపారు. ప్రతి భూమికి భూధార్‌ సంబర్‌, సరిహద్దుల స్పష్టత వస్తుందని.. సర్వే చేసే సమయంలో రైతులు అందుబాటులో ఉండి సహకరించాలని కోరారు. భూ సరిహద్దులు, రికార్డుల్లో ఉన్న విస్తీర్ణం తేడాలను పరిశీలించి స్పష్టంగా నమో దు చేస్తారని వివరించారు. సర్వే పారదర్శకంగా ని ర్వహిస్తారని.. సర్వేయర్లు గ్రామానికి వచ్చినప్పడు అందుబాటులో ఉండి తమ భూముల సరిహద్దులు చూపించాలని కోరారు. గ్రామంలో సుమారు 450 ఎకరాల భూమి ఉన్నందున 30 ఎకరాల చొప్పున 15 నుంచి 20 రోజుల్లో సర్వే పూర్తి చేయాలన్నారు. ముందస్తు కార్యాచరణతో సర్వే తేదీలను రైతులకు ముందుగానే తెలియజేయాలని సూచించారు. రైతులకు ఏమైనా అభ్యంతరాలుంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని.. త్వరలో టోల్‌ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేస్తామని, అ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని వివరించారు. రీ–సర్వే విజయవంతానికి అందరూ సహకరించాలన్నారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రం, పాఠశాలను తనిఖీ చేశారు. అంగన్‌వాడీ భవనం నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ రాములు, తహసీల్దార్‌ అబ్దుల్‌ రహమాన్‌, ఎంపీడీఓ శ్రీనివాసులు, రెవెన్యూ ఆర్‌ఐ సుధాకర్‌రెడ్డి, డైరెక్టర్‌ శంకర్‌లింగం పాల్గొన్నారు.

ఊట్కూర్‌: విద్యార్థులకు పుస్తకమే గొప్ప ఆయుధమని.. చదువుతో ఆర్థిక స్వాతంత్య్రం వస్తుందని కలెక్టర్‌ ప్రియాంక అన్నారు. బుధవారం మక్తల్‌లోని ఊట్కూర్‌ ఎస్సీ, ఎస్టీ గురుకుల పాఠశాల, కళాశాలను ఆమె సందర్శించారు. తరగతి గదులు, డార్మెటరీ, మరుగుదొడ్లు, వంటగది, స్టోర్‌రూమ్‌ తదితర ప్రాంతాలను పరిశీలించారు. స్టోర్‌రూమ్‌లో నిత్యావసరాల నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇంటర్మీడియట్‌ రెండేళ్లు కష్టపడి చదివితే బంగారు భవిష్యత్‌ ఉంటుందని.. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని కోరారు. పాఠశాల, కళాశాల సిబ్బంది విద్యార్థుల విద్యాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఆమె వెంట పుర కమిషనర్‌ రాజయ్య, ప్రిన్సిపాల్‌ మంజుల తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement