విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించం | - | Sakshi
Sakshi News home page

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించం

Oct 1 2026 4:52 AM | Updated on Oct 1 2026 4:52 AM

నారాయణపేట: బాలలు, వృద్ధుల సంరక్షణలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి వింధ్యానాయక్‌ హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు బుధవారం జిల్లాకేంద్రంలోని బోరంబావి సమీపంలో ఉన్న బాలల ఆశ్రమాలు, వృద్ధాశ్రమాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాజరు పట్టికలను పరిశీలించి రోజూ విధులకు హాజరవుతున్నారా? అప్పగించిన విధులను సక్రమంగా నిర్వహిస్తున్నారా? అని సిబ్బందిని ఆరా తీశారు. కొందరు సిబ్బంది అందుబాటులో లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇకపై ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకూడదని నిర్వాహకులను హెచ్చరించారు. వివిధ రికార్డులను పరిశీలించి ఆశ్రమాలకు వచ్చిన ఆహార ధాన్యాల పరిమాణం, నాణ్యతను స్టాక్‌ రిజిస్టర్లతో సరిపోల్చి చూశారు. రోజూ సరుకుల నిల్వలు, కొనుగోలు చేసి స్టాక్‌ వివరాలను విధిగా రిజిస్టర్లలో నమోదు చేయాలని సూ చించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా? అని తెలుసుకున్నారు. రోజూ తాజా కూరగాయలు కొనుగోలు చేసి వండా లని.. తాగునీరు, బెడ్‌షీట్లు, గదులు, బాత్‌రూమ్‌లు, వాష్‌రూమ్‌లను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఆశ్రమాల్లోని మందులు, సిరప్‌లను పరిశీలించి చివరి గడువులను తనిఖీ చేశారు. సొంత తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల మాదిరిగా ఆప్యాయంగా చూసుకోవాలని సిబ్బందికి సూచించారు. బాలల స్నేహపూర్వక న్యాయసేవల పథకం–2024, సీనియర్‌ సిటిజన్లకు న్యాయసేవలు– 2016 పథకాలపై అవగాహన కల్పించారు. వృద్ధు లకు ఉచిత న్యాయ సాయం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సదరం సర్టిఫికెట్లు, బాలల హక్కుల గురించి వివరించారు. ఆమె వెంట చీఫ్‌ లీగల్‌ డిఫెన్స్‌ కౌన్సి ల్‌ కె.లక్ష్మీపతిగౌడ్‌, పోలీసు అధికారులు, సంబంధిత ఆశ్రమాల నిర్వాహకులు, సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement