స్నేహం.. ఓ వరం | - | Sakshi
Sakshi News home page

స్నేహం.. ఓ వరం

Aug 2 2026 2:04 AM | Updated on Aug 2 2026 2:04 AM

మంచి స్నేహితుడు మనసుకు, జీవితానికి ఓ భరోసా

చదువులో సహకారం..

ఒత్తిడిలో ఉపశమనం..

లక్ష్య సాధనలో మార్గదర్శనం

ఒకరికి ధైర్యం..

మరొకరికి మార్గదర్శి

స్నేహితుల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ టాక్‌షో

ఉత్సాహంగా పాల్గొన్న స్ఫూర్తి డిగ్రీ కళాశాల విద్యార్థులు

‘స్నేహం అంటే కలిసి తిరగడం.. సరదాగా మాట్లాడుకోవడం మాత్రమే కాదు.. అవసరమైనప్పుడు అండగా నిలవడం, కష్టాల్లో ధైర్యం చెప్పడం, తప్పు దారిలో వెళ్తుంటే హెచ్చరించడం, రక్త సంబంధం లేకపోయినా తోడుగా నిలిచి మన భావాలను అర్థం చేసుకొని ధైర్యం చెప్పే బంధమే నిజమైన స్నేహం. చదువు, వ్యక్తిత్వ వికాసం, మానసిక ప్రశాంతత, నాయకత్వ లక్షణాల పెంపులో స్నేహం కీలకపాత్ర పోషిస్తుంది. విద్యార్థి జీవితంలో స్నేహం ఇలాంటి ఎన్నో రూపాల్లో కనిపిస్తుంది. శనివారం జిల్లాకేంద్రంలోని స్ఫూర్తి డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ‘సాక్షి’ టాక్‌ షోలో విద్యార్థులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.’ – నారాయణపేట ఎడ్యుకేషన్‌

అమ్మే నా స్నేహితురాలు..

స్నేహం అంటే వయసు, సంబంధం, రక్తబంధం అవసరం లేదు. మా అమ్మ నాకు సమాజంలో జరిగే మంచి చెడులను వివరిస్తూ, ఎలా మెలగాలో నేర్పిస్తూ స్నేహితురాలిలా అండగా నిలుస్తోంది. చిన్నప్పటి నుంచి మా అమ్మే నాకు స్నేహితురాలు. ఏ విషయాన్ని అయినా ఆమెతో పంచుకుంటా.

– శ్రీలత, బీజెడ్‌సీ, ప్రథమ సంవత్సరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement