స్నేహితుడంటే తన సంతోషాన్ని మాత్రమే పంచుకునే వారు కాదు.. కష్టసుఖాలను అర్థం చేసుకొని ఎల్లప్పుడూ మన క్షేమాన్ని కోరేవారు. ఇలాంటి స్నేహితుడి ఉనికి విద్యార్థి జీవితంలో ఒక భరోసాను కల్పిస్తుంది.
– ఆంజనేయులు, బీజెడ్‌సీ,
ద్వితీయ సంవత్సరం
నేను ఉన్నా అనే ధైర్యం..
జీవితంలో అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు మనిషికి మొదట కావాల్సింది నేను ఉన్నానంటూ ధైర్యం చెప్పే వాడే నిజమైన స్నేహితుడు.
సమస్య వచ్చినప్పుడు భయపడొద్దు.. అండగా ఉండే స్నేహితుడు ఉంటే కొండంత ధైర్యం.
– భవిత, బీజెడ్‌సీ, ద్వితీయ సంవత్సరం
పదేళ్లుగా.. ఓ మార్గదర్శిగా...
భవ్యతో పదేళ్లుగా కొనసాగుతున్న స్నేహం కేవ లం అనుబంధం మా త్రమే కాదు.. చదువులో నూ మార్గదర్శిగా నిలుస్తోంది. సందేహాలు వ చ్చినప్పుడు నివృత్తి చేస్తోంది. ఆమె నా నాకు స్నేహితురాలు మాత్రమే కాదు.. చదువులో మంచి మార్గదర్శి కూడా.
– నిఖిత,
బీకాం, ప్రథమ
సంవత్సరం


