నంద్యాల(అర్బన్): నంద్యాల జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు జరగాల్సిన ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం శుక్రవారం ముగిసింది. మూడు రోజుల పాటు జరిగిన జెడ్పీటీసీ నామినేషన్ల స్వీకరణకు సంబంధించి మొత్తం 28 జెడ్పీటీసీలకు 169 నామినేషన్లు దాఖలైనట్లు సంబంధిత అధికారులు తెలిపారు. శుక్రవారం అత్యధికంగా 84 నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి రోజు 21వ తేదీ జెడ్పీటీసీ స్థానాలకు 9 నామినేషన్లు, రెండవ రోజు 76, మూడవ రోజు 84 మొత్తం 169 నామినేషన్లు దాఖలయ్యాయి. వైఎస్సార్సీపీ నుంచి 44 నామినేషన్లు వచ్చాయి.


