కొత్త పింఛన్లు లేవు | - | Sakshi
Sakshi News home page

కొత్త పింఛన్లు లేవు

Oct 29 2026 1:36 AM | Updated on Oct 29 2026 1:36 AM

50 ఏళ్లు దాటిన బీసీలందరికీ పింఛన్లు ఇవ్వాలి

కొత్త పింఛన్ల దరఖాస్తుల వివరాలు..

చంద్రబాబు అధికారం చేపట్టి దాదాపు రెండున్నరేళ్లు అవుతున్నా...50 ఏళ్లకే బీసీలకు, ముస్లింలకు పింఛన్‌ ఊసే లేకుండా పోయింది. కనీసం 60 ఏళ్లు నిండిన వారికి కొత్త పింఛన్‌లు ఇవ్వాలనే ఆలోచన కూడా లేకుండా పోయింది. దీన్ని బట్టి చూస్తే అవ్వాతాతలు, వితంతు మహిళలు, దివ్యాంగులను చంద్రబాబు దారుణంగా దగా చేశారననే విషయం స్పష్టమవుతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 97,500 మంది కొత్త దరఖాస్తుదారుల నోట్లో మట్టికొట్టారు. అలాగే 50 ఏళ్లు నిండిన 2.50 లక్షల మంది బీసీ, ఎస్టీ, ఎస్సీ, ముస్లింలను మోసం చేశారు.
పింఛన్లలో కోత ఇలా..

● ఇప్పట్లో కొత్త పింఛన్లు లేవు

● ఉమ్మడి జిల్లాలో

97,500 దరఖాస్తులు

● మొత్తం 83,787 దరఖాస్తులకు

ఆమోదం

● ఎన్నికల కోడ్‌ రావడంతో డిసెంబర్‌

మొదటి వారం వరకు ఆగాల్సిందే

● అప్పుడైనా ఇస్తారో..లేదో!

● చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నెలనెలా పింఛన్లలో గుట్టుచప్పడు కాకుండా కోత పడుతోంది.

● ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2024 జూన్‌ నెలలో 4,67,389 పింఛన్‌లు ఉన్నాయి.

● 2026 అక్టోబరు నెలలో

పింఛన్‌లు 4,42,249కు

తగ్గిపోయాయి.

● చంద్రబాబు సర్కార్‌ ఏర్పాటు తర్వాత ఉమ్మడి జిల్లాలో 25,140 పింఛన్లను తొలగించారు.

● తొలగించిన వాటి స్థానంలో కొత్త వారికి

అవకాశం కల్పించలేదు.

● పింఛన్లు అడ్డుగోలుగా తొలగిస్తుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది.

బీసీలకు 50 ఏళ్లకే పింఛన్‌లు ఇస్తామని ప్రకటించిన చంద్రబాబు నేడు ఈ ఊసే ఎత్తడం లేదు. ప్రచారానికి మాత్రం కోట్ల రూపాయలు మంచినీళ్ల ప్రాయంలా ఖర్చు చేస్తున్నారు. అప్పట్లో వలంటీర్లు ప్రజలకు అనేక రకాలుగా సేవలు అందించారు. నేటి సోషల్‌ మీడియా ఇన్‌ప్లుయెన్సర్లతో ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు. ప్రచారానికి కోట్లు ఖర్చు చేసే బదులు పింఛన్‌లు ఇస్తే మేలు జరుగుతుంది. నాకు ఇప్పుడు 55 ఏళ్లు. బీసీ సామాజిక వర్గానికి చెందిన వాడిని. నాకు 50 ఏళ్లు దాటినందున పింఛన్‌కు అర్హత వచ్చింది. ఇచ్చిన హామీ మేరకు మాలాంటి వాళ్లందరికీ పింఛన్లు ఇవ్వాలి.

–ఓబులేసు, రామాపురం, తుగ్గలి మండలం

కర్నూలు(అగ్రికల్చర్‌): రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైన 26 నెలల తర్వాత కొత్త పింఛన్ల అంటూ దరఖాస్తులను ఆహ్వానించారు. ఆన్‌లైన్‌లో తొమ్మిది రోజులు మాత్రమే అవకాశం కల్పించారు. సుదీర్ఘ కాలం తర్వాత అవకాశం రావడంతో అవ్వాతాతలు, దివ్యాంగులు, వితంతువులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే వీరి నోళ్లలో చంద్రబాబు ప్రభుత్వం మట్టి కొటింది. ఇప్పట్లో కొత్త పింఛన్లు లేనట్లేనని తేలిపోయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధిపొందాలనే దురుద్దేశంతో హడావుడిగా కొత్త పింఛన్‌ల కోసం సెప్టెంబరులో షెడ్యూలు విడుదల చేశారు. గత నెల 7 నుంచి 18వ తేదీ వరకు కేవలం తొమ్మిది రోజులు మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తులను రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. ముందుగా నిర్ణయించిన ప్రకారమైతే అక్టోబరు నెలలోనే కొత్త పింఛన్‌లు ఇవ్వాల్సి ఉంది. కాని దరఖాస్తులు వెల్లువెత్తడంతో ఎగనామం పెట్టారు. స్థానిక ఎన్నికల ప్రక్రియ మొదలు కావడంతో డిసెంబరు మొదటి వారం వరకు ‘కోడ్‌’ అమలులో ఉంటుంది. ఆ తర్వాత అయినా కొత్త పింఛన్లు ఇస్తారో లేదో అని అవ్వాతాతలు ఆందోళన చెందుతున్నారు.

మోసం ఇలా..

2024 జనవరిలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అర్హులైన వారందరికీ కొత్త పింఛన్‌లు ఇచ్చారు. చంద్రబాబు సర్కార్‌ 2024 జూన్‌లో ఏర్పాటైంది. ఇంతవరకు కొత్త పింఛన్ల జాడలేకుండా పోయింది. అధికారంలోకి వచ్చిన తర్వాత రెండున్నరేళ్లకు కొత్త పింఛన్‌లు అంటూ హడావుడి చేశారు. 2024 ఎన్నికల సమయంలో బీసీ ఎస్సీ, ఎస్టీ ముస్లిం మైనార్టీలందరికి 50 ఏళ్లకే పింఛన్‌ ఇస్తాం అంటూ ఊరూరా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచారం చేశారు. దీనిని టీడీపీ అనుకూల మీడియా కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 50 ఏళ్లు నిండిన 2.50 లక్షల మంది బీసీ, ఎస్టీ, ఎస్సీ, ముస్లింలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన చంద్రబాబు.. 50 ఏళ్లకే పింఛన్‌ ఇవ్వడం కాదు గదా.. కొత్త పింఛన్‌ల ఊసే ఎత్తలేదు. అప్పట్లో చంద్రబాబు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెల్లిన పచ్చ మీడియా నేడు మౌనం వహించింది. చంద్రబాబును నమ్మి మోసపోయామని తెలుసుకోవడానికి ప్రజలకు ఎన్నో రోజులు పట్టలేదు.

జిల్లా దరఖాస్తులు ఆమోదం

కర్నూలు 53,352 44,059

నంద్యాల 44,148 39,728

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement