చంద్రబాబు.. కరువు కవల పిల్లలు | - | Sakshi
Sakshi News home page

చంద్రబాబు.. కరువు కవల పిల్లలు

Oct 29 2026 1:36 AM | Updated on Oct 29 2026 1:36 AM

● మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి

బేతంచెర్ల: ముఖ్యమంత్రి చంద్రబాబు.. కరువు కవల పిల్లలని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి అన్నారు. పాలించే రాజు మంచివాడయితే ప్రకృతికూడా సహకరిస్తుందని, చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా కరువు కటకాలు వస్తున్నాయన్నారు. ఇంతటి ఘోరమైనా కరువును తాను ఎప్పుడూ చూడలేడదన్నారు. బేతంచెర్ల పట్టణంలోని అమ్మవారిశాలలో బుధవారం ఆర్యవైశ్యులతో, వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ముస్లింలతో సమావేశం నిర్వహించారు. సమావేశాల్లో బుగ్గన మాట్లాడుతూ.. చంద్రబాబు ఇప్పటి వరకు నాలుగు సార్లు సీఎం అయ్యారని, ప్రతి సారీ ప్రజలకు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా డోన్‌ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి పనులు చేశారో ప్రజలకు వివరించాలన్నారు. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, బీసీలకు 50 సంవత్సరాలకు పింఛన్‌ హామీల పరిస్థితి ఏమిటని నిలదీశారు. టీడీపీ నేతలు అక్రమ సంపాదనకు తెరలేపి మద్యంను డోర్‌ డెలివరీ చేస్తున్నారని ఆరోపించారు.

వైఎస్సార్‌సీపీ హయాంలో

అన్ని రకాల అభివృద్ధి

తాము అధికారంలో ఉన్న సమయంలో డోన్‌ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని బుగ్గన తెలిపారు. బేతంచెర్ల మండలాన్ని ఎడ్యుకేషనల్‌ హబ్‌గా మార్చామన్నారు. ఎంజేపీ పాఠశాలను రూ .36 కోట్లతో పూర్తి చేసి ప్రారంభించామన్నారు. గోరుకల్లు రిజర్వాయర్‌ నుంచి రూ. 351 కోట్లతో వాటర్‌ గ్రిడ్‌ పథకం చేపట్టి ఇంటింటికీ కృష్ణా నీళ్లు అందించామన్నారు. గ్రామగ్రామానికి రోడ్డు సౌకర్యంతో పాటు డోన్‌, వెల్దుర్తి, పాణ్యం, కర్నూలు వైపు రహదారులను డబుల్‌గా మార్చామన్నారు.

ప్రజల నుంచి టీడీపీ నేతల వసూళ్లు!

అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ నేతలు అభివృద్ధిని అడ్డుకుంటున్నారన్నారు. ఎంజేపీ పాఠశాలలో పిల్లలు కూర్చోడవడానికి బల్లలు కూడా ఏర్పా టు చేయలేదన్నారు. ప్రభుత్వ ఐటీఐ పూర్తయినా నేటి వరకు ప్రారంభించలేదన్నారు. పాలిటెక్నిక్‌ భవన నిర్మాణ పనులు చేపట్టలేదన్నారు. ఎంఎస్‌ఎంఈని మంగళగిరికి తరలించారన్నారు. తాము రూ.55 కోట్ల తో చేపట్టిన మద్దిలేటి నరసింహస్వామి ఆలయ ముఖ ద్వారం పనులను ప్రారంభించలేదన్నారు. బేతంచెర్లలో రూ.44 కోట్లతో టెండర్లు పూర్తయిన అమృత 2.0 పథకం పనులను కమీషన్ల కోసం రద్దు చేశారన్నారు. బేతంచెర్లలో ప్రజల నుంచి టీడీపీ నేతలు డబ్బులు దండుకుంటున్నారని ఆరోపించారు.

వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలి

బేతంచెర్ల నగరపంచాయతీ ఎన్నికల్లో 28 మంది వార్డుల కౌన్సిలర్లతో పాటు చైర్మన్‌ అభ్యర్థి దూదేకుల దస్తగిరి ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలన్నారు. స్వాతంత్య్రం రాకముందు నుంచి బేతంచెర్ల అభివృద్ధి కి తమ పెద్దలు కృషి చేశారన్నారు. వారి వారసత్వాన్ని తాను కొనసాగిస్తున్నానన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయంలో నాపరాళ్లపై 18 శాతం ఉన్న జీఎస్టీనీ 5 శాతం తగ్గించిన ఘనత మాజీ మంత్రి బుగ్గన దక్కుతుందని పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గుండా గోపాలు, ముస్లింలు అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బుగ్గన నాగభూషణం రెడ్డి, వివిధ కార్పొరేషన్ల మాజీ డైరక్టర్లు మూర్తుజావలి, ఖాజా హుసేన్‌, నాయకులు బుగ్గన చంద్రారెడ్డి, చలంరెడ్డి, మురళీకృష్ణ, రామ చంద్రుడు, శాలిబేగ్‌, సయ్యద్‌, రియాజ్‌, పిట్టల జాకీర్‌ హుస్సేన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement