జెడ్పీ ఎన్నికల బరిలో 79 మంది | - | Sakshi
Sakshi News home page

జెడ్పీ ఎన్నికల బరిలో 79 మంది

Oct 29 2026 1:36 AM | Updated on Oct 29 2026 1:36 AM

● 19 చోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల పోటీ

నంద్యాల(అర్బన్‌): కొత్తగా ఏర్పాటు అయిన తొలి జిల్లా పరిషత్‌ పోరులో నిలిచేదెవరో తేలిపోయింది. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల అధికారులు విడుదల చేశారు. జిల్లాలోని 28 జెడ్పీటీసీ స్థానాలకు 167 నామినేషన్లు వేశారు. వాటిలో మంగళవారం సాయంత్రానికి 88 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో 79 మంది పోటీలో నిలిచారు. ఆళ్లగడ్డ, గోస్పాడు, కొత్తపల్లి్‌, శిరివెళ్ల, గడివేముల, పాములపాడు, మహానంది, దొర్నిపాడు, ఆత్మకూరు, నందికొట్కూరు, జూపాడుబంగ్లా జెడ్పీటీసీల బరిలో ఐదుగురు నుంచి ఆరుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 28 జెడ్పీటీసీ స్థానాల్లో 8 మంది జెడ్పీటీసీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 20 జెడ్పీటీసీల్లో వైఎస్సార్‌సీపీ 19 స్థానాల్లో పోటీ చేస్తోంది. టీడీపీ 20 జెడ్పీటీసీలకు జనసేన, 5 చోట్ల, కాంగ్రెస్‌ 8, స్వతంత్రులు 17 పోటీలో నిలిచారు. డోన్‌ జెడ్పీటీసీ స్థానానికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయలేకపోవడంతో సీపీఐ అభ్యర్థి, టీడీపీ అభ్యర్థులు పోటీలో నిలిచారు.

ఐదు చోట్ల త్రిముఖ పోటీ...

చాగలమర్రి, నంద్యాల, పగిడ్యాల, రుద్రవరం, పాణ్యంలలో ముగ్గురు చొప్పున పోటీచేస్తున్నారు. ఉయ్యాలవాడ, మిడుతూరు, బండిఆత్మకూరు, డోన్‌ జెడ్పీటీసీ స్థానాల్లో ఇద్దరు అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది.

ప్యాపిలిలో వైఎస్సార్‌సీపీ ఏకగ్రీవం

పోలీసులు, అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లు తీవ్రతరమైన నేపథ్యంలో ప్యాపిలి మండల జెడ్పీటీసీ స్థానాన్ని వైఎస్సార్‌సీపీ కై వసం చేసుకుంది. ప్యాపిలిలో ఫ్యాన్‌ గాలికి టీడీపీ నాయకులు చెల్లాచెదురు అయ్యారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కృష్ణమూర్తి ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి శివశంకర్‌ పత్రాన్ని అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement