ఉయ్యాలవాడ: ఉయ్యాలవాడ జెడ్పీటీసీ బరిలో వరుసకు అత్తాకోడళ్లు అయిన బుడ్డా భాగ్యమ్మ(వైఎస్సార్సీపీ), పేరెడ్డి స్వరూపరాణి(టీడీపీ) అభ్యర్థులుగా ఉన్నారు. వైఎస్సార్సీపీ నుంచి ఉయ్యాలవాడకు చెందిన తాజా మాజీ ఎంపీపీ బుడ్డా భాగ్యమ్మ, టీడీపీ నుంచి తుడుమలదిన్నె గ్రామానికి చెందిన పేరెడ్డి స్వరూపరాణిలో పోటీల్లో ఉన్నారు. ఉయ్యాలవాడ జెడ్పీటీసీ స్థానానికి నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. వీరిలో తోపుల వరాలు(స్వతంత్ర), ఇరిగెల బిందుమాధవీ(జనసేన) అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో వైఎస్సార్పీపీ, డీటీపీ అభ్యర్థిణుల మధ్య పోటీ నెలకొంది. మండల పరిధిలోని 20 గ్రామ పంచాయతీల్లో మొత్తం 23,112 మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్లు ఎవరిపైపు మొగ్గు చూపుతారన్నది ఆసక్తికరంగా మారింది.
పేరెడ్డి స్వరూపరాణి
బుడ్డా భాగ్యమ్మ


