ఆళ్లగడ్డ: దిగువ అహోబిలంలో వార్షిక పవిత్రోత్సవా లు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం వేకువజామునే మూలమూర్తులు ప్రహ్లాదవరదస్వామి, అమృతవల్లీ అమ్మవార్లను సుప్రభాత సేవతో మేలుకొలిపి దివ్య దర్శ నం అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండితుల వేదమంత్రోచ్చారణలతో ఆస్థాన విద్వాంసు ల మంగళవాయిద్యాల మధ్య పవిత్ర హోమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. రాత్రి ప్రత్యేకంగా అలంకరించిన ఉత్సవ పల్లకీలో ఉభయ దేవేరులతో కొలువైన ప్రహ్లాదవరుదుడు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.


