తుంగభద్ర నీటి వాటా గల్లంతే! | - | Sakshi
Sakshi News home page

తుంగభద్ర నీటి వాటా గల్లంతే!

Oct 30 2026 2:15 AM | Updated on Oct 30 2026 2:15 AM

కర్నూలు సిటీ: తుంగభద్ర డ్యాం నుంచి కేటాయించిన నీరు ఉమ్మడి కర్నూలు జిల్లాకు రావడంలేదు. చాలా గ్రామాల్లో గుక్కెడు నీరు లభించని పరిస్థితి నెలకొంది. సాగు చేసిన పంటలు కళ్ల ముందే ఎండిపోయాయి. కుటుంబ పోషణకు రైతులు సైతం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. అయినా టీడీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కనీసం స్పందించడం లేదు. నీటి కేటాయింపుల్లో అన్యాయం జరుగుతున్నా నోరువిప్పడం లేదు. ఇదిలా ఉండగా జిల్లాకు కేటా యించిన తుంగభద్ర జలాలను అనంతపురం జిల్లాకు మళ్లించునేందుకు రంగం సిద్ధం అయ్యింది. వచ్చే ఏడాది జూలై చివరి వరకు తాగునీటి అవసరాలకు నీరు అవసరం. అయితే ఆ నీటికి సైతం జిల్లాకు దక్కకుండా అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ కీలక నేతలు మళ్లించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే హెచ్చెల్సీ ఇంజినీర్ల ద్వారా ఎల్‌ఎల్‌సీ, కేసీ వాటాలో నుంచి 2 నుంచి 3 టీఎంసీల నీ టిని మళ్లించుకునేందుకు అనుమతులు తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఉండడంతో నీటిని మళ్లించుకునేందుకు వేచి చూస్తున్నారు. వచ్చే నెలలో నగరపాలక, మున్సిపల్‌ ఎన్నికలు ముగిసిన మరుసటి రోజే నీటిని మళ్లించుకోనున్నారు.

టీడీపీ నేతల నిర్లక్ష్యం...

జిల్లా ప్రజలకు శాపం!

ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు తుంగభద్ర డ్యాం. ఎగువ రాష్ట్రంలో కురిసిన వర్షాలతో టీబీ డ్యాంకు 100 టీఎంసీల నీరొచ్చింది. ఇందులో దామాషా ప్రకారం తుంగభద్ర దిగువ కాలువకు 12.226 టీఎంసీల నీటిని కేటాయించారు. వర్షాభావ పరిస్థితులతో ఆయకట్టుకు నీరు ఇవ్వలేమని..తాగుకు ప్రాధాన్యత అని ఇప్పటి వరకు 5.7 టీఎంసీల నీటిని వినియోగించారు. కేసీ కెనాల్‌ వాటాగా 5.09 టీఎంసీల నీటిని కేటాయించారు. ఒక టీఎంసీ నీటిని ఈ నెల 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు డ్యాం నుంచి రోజుకు 2 వేల చొప్పున నీటిని తుంగభద్ర నదికి విడుదల చేస్తున్నారు. ఇంకా టీబీ జలాల్లో 10.616 టీఎంసీల నీరు జిల్లా వాటాగా ఉంది. అయితే ఈ నీటిలో నుంచి 2 నుంచి 3 టీఎంసీల నీటిని మళ్లించుకునేందుకు అనుమతులు ఇవ్వాలని జలవనరుల శాఖ ఉన్నతాధికారులకు హెచ్చెల్సీ ఎస్‌ఈతో అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ నేతలు లేఖ రాయించినట్లు తెలుస్తోంది. ఈ విషయం జిల్లాకు చెందిన జల వనరుల శాఖ ఇంజినీర్లకు సైతం తెలుసు అయినా...తమకు ఏపీ తెలియదు అన్నట్లు ఉన్నారు. అనంతపురం జిల్లాలోని కీలక రిజర్వాయర్లు, చెరువులను హంద్రీ–నీవా నీటితో నింపుకున్నారు. ఈ ఏడాది హంద్రీ–నీవాకు 19 టీఎంసీలకుపైగా పంపింగ్‌ చేయగా కర్నూలు జిల్లాకు 3 టీఎంసీలు కూడా ఇవ్వలేదు. అనంతపురం జిల్లాకు తాగునీటి అవసరాలకు సరిపడా నీరు ఉన్నప్పటికీ కర్నూలు జిల్లాకు కేటాయింపులో కోత పెడుతున్నారు. రానున్న వేసవి కాలంలో తాగునీటికి ముప్పు వచ్చే ప్రమాదం ఉందని ఇంజినీరింగ్‌ వర్గాలే అభిప్రాయ పడుతున్నారు. కనీసం ఇప్పటికై నా జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు స్పందించకపోతే గడ్డు పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది.

తుంగభద్ర దిగువ కాలువ (ఫైల్‌)

జిల్లాకు 17.316 టీఎంసీల

కేటాయింపు

ఇప్పటి వరకు 5.7 టీఎంసీల

వినియోగం

మిగతా నీటిని ‘అనంత’కు

తరలించేందుకు ఎత్తుగడ

విషయం తెలిసినా పట్టించుకోని

టీడీపీ నేతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement