బేతంచెర్ల/డోన్ రూరల్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ సునీల్ షోరాణ్ అన్నారు. బేతంచెర్లకు సంబంధించి గోరుమానుకొండ సమీపాన ఎంజేపీ స్కూల్‌లోని కౌంటింగ్ కేంద్రంలో, డోన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ టేబుళ్లను వారు పరిశీలించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శంగా నిర్వహించేందుకు అధికారు లు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. సీసీ టీవీ కెమెరాలతో కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేస్తామ న్నారు. వారి వెంట ఆర్డీఓ నరసింహులు, డీఎస్పీ శ్రీనివాసులు, డోన్ మున్సిపల్ కమిషనర్ నరేష్‌రెడ్డి, బేతంచెర్ల తహసీల్దార్ నాగమణి, నగర పంచాయతీ కమిషనర్ హరి ప్రసాద్, సీఐ వెంకటేశ్వరరావు, ఎస్‌ఐ రమేష్ బాబు ఉన్నారు.


