అవినీతిని ఓడించి అభివృద్ధికి పట్టం కట్టండి | - | Sakshi
Sakshi News home page

అవినీతిని ఓడించి అభివృద్ధికి పట్టం కట్టండి

Oct 30 2026 2:15 AM | Updated on Oct 30 2026 2:15 AM

● మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

డోన్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో అవినీతి, అభివృద్ధికి మధ్య పోటీ జరుగుతుందని, ప్రజలు అభివృద్ధికి ఓటేసి గెలిపించాలని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పట్టణ ఓటర్లకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మా జీ మంత్రి బుగ్గన ఇంటింటికి తిరిగి ఓటర్లను స్వయంగా కలిసి గత మూడేళ్లుగా టీడీపీ నేతల అక్రమాలు, అవినీతిని గుర్తు చేశారు. ఇసుక, మట్టి, మద్యం, మైనింగ్‌లో అనేక అక్రమాలకు పాల్పడి రూ. లక్షలు దోచుకున్నారన్నారు. గత వైఎస్సార్‌సీపీ పాలన లో చేసిన అభివృద్ధిని చూసి ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలన్నారు.

మూడేళ్లలో ఏం చేశారో చెప్పండి

బేతంచెర్ల: అధికారంలోకి వచ్చి మూడేళ్లలో ప్రజలకు ఏం చేశారో సమాధానం చెప్పాలని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి కూటమి నేతలను ప్రశ్నించారు. గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి మాజీ మంత్రి బుగ్గన నాయకులు, కార్యకర్తలతో కలిసి పాత బస్టాండు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్‌సీపీ హయాంలో పూర్తి చేసిన పనులకు రిబ్బన్లు కట్‌ చేస్తూ, తామే అభివృద్ధి చేసినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. రూ.2కోట్లతో అభివృద్ధి చేసిన బిల్ల స్వర్గం గుహల వద్ద సినిమా ప్యాకేజీలు తీసుకున్న చరిత్ర ఎవరిదో ప్రజలకు తెలుసన్నారు. తా ము ఇంటింటికి బియ్యం సరఫరా చేస్తే కూటమి ప్రభుత్వం మద్యం డెలివరీ చేస్తుందని ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement