రాష్ట్ర వ్యాప్తంగా అనధికార లేఅవుట్‌లను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం 2020 ఆగస్టులో ఎల్‌ఆర్‌ఎస్‌ను తీసుకువచ్చింది. దీనికి ఉమ్మడి జిల్లాలో ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఒక్క నందికొండ మున్సిపాలిటీ మినహా మిగితా 18 మున్సిపాలిటీల నుంచి 1,91,187 మంది రూ.19.04 కోట్లు చెల్లించి రెగ్యులరైజేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మండల కేంద్రాలు, గ్రామాల్లో 57,554 మంది రూ.5.75 కోట్లు చెల్లించి దరఖాస్తు చేకున్నారు. ఆ దరఖాస్తుల పరిశీలన అప్పట్లో తలెత్తిన న్యాయ వివాదాల కారణంగా పెండింగ్‌లో పడింది. 2024లో ఇందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఆ తరువాత రెండుసార్లు అవకాశం ఇచ్చింది. ఇప్పుడు మరోసారి క్రమబద్దీకరణకు ఆదేశాలు జారీచేసింది.ఉమ్మడి జిల్లాలో 19 మున్సిపాలిటీలు ఉండగా, నందికొండ మినహా మిగితా మున్సిపాలిటీల పరిధిలో భారీగా దరఖాస్తులు వచ్చినా వాటిని పరిష్కరించడంలో ఎడతెగని జాప్యం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం మరోసారి ఎల్‌ఆర్‌ఎస్ గడువు పొడగించింది. నవంబరు 30వ తేదీ వరకు మళ్లీ గడువు పెంచినా ఆలోగా ఎంతమేరకు పరిష్కరిస్తారన్నది వేచిచూడాల్సిందే.
పరిశీనలో విఫలం
మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో అనధికార లేఅవుట్‌లలో ప్లాట్లను కొనుగోలు చేసిన ప్రజలు వాటిని క్రమబద్దీకరించుకునేందుకు ఆరేళ్ల కిందట ఒక్కొక్కరు రూ.1000 చొప్పున ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు. ఇలా జిల్లాలో దాదాపు 1.91 లక్షల మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశారు. వారిలో చాలా మంది వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ సకాలంలో అప్‌లోడ్ చేయలేదు. కొంత మంది మాత్రం డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేశారు. ప్రస్తుతం వారంతా ఎల్‌ఆర్‌ఎస్ వెబ్‌సైట్ ద్వారా (ఆన్‌లైన్‌లో) డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అలా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన వాటిని కూడా పరిశీలించి తగిన చర్యలు చేపట్టడంలో అధికారులు విఫలం అవుతున్నారు. అసలు ఎన్ని దర ఖాస్తుల్లో ఎలాంటి లోపాలు ఉన్నాయి..? పత్రాలు సరిగ్గా లేనివి ఎన్ని?.. ఏయే పత్రాలను సమర్పించాలి.. ఫీజు చెల్లించినా రెగ్యులరైజేషన్ చేయించుకునేందుకు ముందుకు రావడంలేదనే వివరాలను క్రోడీకరించి, ఆయా దరఖాస్తుదారులకు సమాచారం ఇచ్చే వ్యవస్థే లేకపోవడంతో ఎల్‌ఆర్‌ఎల్ గందరగోళంగా తయారైంది.
ప్రాసెస్ చేసిందీ మూడింట
ఒకటో వంతే...
ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో 1,91,187 మంది ప్రజలు ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకోగా, అందులో కేవలం మూడో వంతు దరఖాస్తులను మాత్రమే అధికారులు ఇప్పటివరకు ప్రాసెస్ చేయగలిగారు. వాటిల్లో 8వేల దరఖాస్తులను తిరస్కరించిన అధికారులు సరైన డాక్యుమెంట్స్ లేవని మరో 25 వేల దరఖాస్తులను పక్కన పెట్టారు. కేవలం 28,543 దరఖాస్తులను మాత్రమే పూర్తి స్థాయిలో పరిశీలించి ఫీజు చెల్లించాక క్రమబద్ధీకరణకు ఓకే చెప్పారు. మరో 32 వేలకు పైగా దరఖాస్తుదారులు ఫీజులను చెల్లించి ఉన్నా వాటిని ఇంకా పరిష్కరించలేదు.
నందికొండ మున్సిపాలిటీకి ఎల్‌ఆర్‌ఎస్ వర్తించదు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ :
ఫ లేఅవుట్‌ల క్రమబద్ధీకరణకు అడ్డంకులెన్నో..
ఫ ఆదాయం వస్తున్నా పట్టించుకోని పరిస్థితిలో యంత్రాంగం
ఫ తాజాగా మరోసారి అవకాశం.. నవంబరు 30వరకు గడువు
మున్సిపాలిటీల వారీగా ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల ప్రోగ్రెస్ ఇదీ..
మున్సిపాలిటీ దరఖాస్తులు ఫీజు చెల్లించినవి రెగ్యులరైజ్డ్ పెండింగ్
నల్లగొండ 31281 – 7732 23549
నకిరేకల్ 785 – 522 263
మిర్యాలగూడ 14340 3274 2401 8665
హాలియా 14975 3913 2468 7594
దేవరకొండ 5188 554 331 4303
చిట్యాల 3273 557 229 2487
చండూరు 3750 703 295 2752
చౌటుప్పల్ 16664 – 2962 13702
మోత్కూరు 3812 – 869 2943
ఆలేరు 5108 1221 830 3057
యాదగిరిగుట్ట 12167 3768 745 7654
పోచంపల్లి 7840 2041 725 5074
భువనగిరి 14148 4852 2448 6848
సూర్యాపేట 36357 8149 4401 23807
కోదాడ 12548 2481 – 10067
హుజూర్‌నగర్ 4737 416 848 3473
నేరేడుచర్ల 3303 912 362 2029
తిరుమలగిరి 911 – 375 536
మొత్తం 191187 32842 28543 128803


