హక్కుల పరిరక్షణకు .. | - | Sakshi
Sakshi News home page

హక్కుల పరిరక్షణకు ..

Aug 26 2026 1:18 AM | Updated on Aug 26 2026 1:18 AM

విద్యార్థుల హక్కుల పరిరక్షణకు శ్రద్ధ చూపాలని చైల్డ్‌రైట్స్‌ ప్రొటెక్షన్‌ కమిషన్‌ చైర్‌పర్సన్‌ సీత సూచించారు.
నల్లగొండ జైలు తనిఖీ
నల్లగొండ జిల్లా కారాగారాన్ని జైళ్ల శాఖ హైదరాబాద్‌ రేంజ్‌ డీఐజీ శ్రీనివాస్‌ మంగళవారం సందర్శించారు.

మోత్కూరులో ‘సంగీత’ శిలలు

మోత్కూరులో కొంత ఇద్దయ్య వ్యవసాయ క్షేత్రం వద్ద ఉన్న నల్ల రాళ్లను కొడితే సంగీత స్వరం వినిపిస్తోంది.

- 8లో

27న మహా ధర్నా, ప్రదర్శన

ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ

నల్లగొండ టౌన్‌ : తెలంగాణ ఎంప్లాయీస్‌ జేఏసీ ఆద్వర్యంలో ఈ నెల 27న నిర్వహించనున్న మహా ధర్న ప్రదర్శను విజయవంతం చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ నాయకులు పిలుపునిచ్చారు. నల్లగొండలో మంగళవారం సమావేశం నిర్వహించి ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. జిల్లాలోని అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ, గెజిటెడ్‌ ఉద్యోగులు, పెన్షనర్ల సంఘాలు ఆందోళనలో పాల్గొనాలని కోరారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సంబంధించిన 64 దీర్ఘకాలిక పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై నిరంతర ఒత్తిడి తీసుకురావాలన్నారు. సెప్టెంబరు 1న పెన్షన్‌ విద్రోహ దినం, సెప్టెంబరు 10న ‘చలో హైదరాబాద్‌’ కార్యక్రమాలను కూడా విజయవంతం చేసేందుకు కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. సమావేశంలో సంఘం నాయకులు వెంకట్‌రెడ్డి, వెంకన్న, రాంబాబు, రమేష్‌, జగదీశ్‌ చంద్ర, సంపత్‌కుమార్‌, ఏడుకొండలు, యశ్వంతరాజ్‌, జనార్ధన్‌రావు పాల్గొన్నారు.

ఆపరేటర్ల విభాగాలు మార్పు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement