గ్రామీణులకు భరోసా.. ఆరోగ్య మహిళా | - | Sakshi
Sakshi News home page

గ్రామీణులకు భరోసా.. ఆరోగ్య మహిళా

Aug 26 2026 1:18 AM | Updated on Aug 26 2026 1:18 AM

పరీక్షలు, మందులు ఉచితం

పరీక్షలు, మందులు ఉచితం

క్యాన్సర్‌, రక్తహీనత, మూత్రనాళ ఇన్స్‌ఫెక్షన్‌, గర్బాశయ ముఖ ద్వార క్యాన్సర్‌, రొమ్ము, నోటి క్యాన్సర్‌, కుటుంబ నియంత్రణ, మోనోపాజ్‌ నిర్వహణ, రుతుక్రమం, ఊబకాయం, బీపీ, షుగర్‌, తదితర పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నారు. సాధారణంగా షుగుర్‌, బీపీతోపాటు క్యాన్సర్‌యేతర ఇతర జబ్బులుఉన్న వారికి అవసరమైన మందులు అందజేస్తున్నారు. ఏమైన వ్యాధులు ఉన్నట్లు అనుమానం వస్తే వారిని జిల్లా కేంద్రంలోని జీజీహెచ్‌కు రెఫర్‌ చేసి తెలంగాణ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌లో ఉచితంగా ఖరీదైన పరీక్షలు నిర్వహించి అక్కడ ప్రత్యేక వైద్యుల చేత వైద్యం అందించడం ద్వారా మహిళల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తున్నారు.

నల్లగొండ టౌన్‌ : మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య మహిళా కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన 11 పీహెచ్‌సీల్లో ప్రతి మంగళవారం కొనసాగుతోంది. మహిళలకు ప్రత్యేక వైద్య పరీక్షలు చేసి వ్యాధులను ముందుగానే గుర్తించి వారి ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు. 2023 మార్చి 8న ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని ప్రారంభించి అమలు చేస్తోంది. మూడేళ్ల నుంచి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 11 కేంద్రాల్లో 1,43,750 మంది మహిళలు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. వీరిలో 1,33,862 మంది మహిళలకు ఓరల్‌ క్యాన్సర్‌, బ్రెస్ట్‌ క్యాన్సర్‌, సర్వైకల్‌ క్యాన్సర్‌ పరీక్షలు చేసి 6,902 మందిని వివిధ రకాల క్యాన్సర్‌ అనుమానితులుగా గుర్తించి జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పిటల్‌ (జీజీహెచ్‌)కు రెఫర్‌ చేశారు.

చేసిన పరీక్షలు ఇలా..

పీహెచ్‌సీ ఓరల్‌ బ్రెస్ట్‌ సర్వైకల్‌

చింతపల్లి 11,300 11,207 1,498

డిండి 40,190 14,116 1,986

దామరచర్ల 9,734 9,707 2,332

నిడమనూరు 13,055 12,998 1,130

వేములపల్లి 13,299 13,342 986

చండూరు 11,547 11,523 1,395

కట్టంగూర్‌ 13,199 13,135 934

తిప్పర్తి 11,562 11,759 2,966

మాన్యంచెల్క 13,563 13,468 1,424

శాలిగౌరారం 9,762 9,856 2,681

మర్రిగూడ 12,651 12,550 2,066

బీపీ మండల్‌ జయంతి

నల్లగొండ టౌన్‌ : బీపీ మండల్‌ 109వ జయంతి సందర్భంగా నల్లగొండలో ఆయన విగ్రహానికి మంగళవారం బీసీ సంక్షేమ సంఘం, కుల సంఘాల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మిరియాల యాదగిరి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ, అల్లి సుభాష్‌, గుండు వెంకటేశ్వర్లు, బక్కతట్ల వెంకన్న యాదవ్‌, పుట్టా వెంకన్న గౌడ్‌, ముప్పిడి మల్లికార్జున్‌ యాదవ్‌ పాల్గొన్నారు.

బీసీ భవన్‌లో

నల్లగొండలోని బీసీ భవన్‌లో మంగళవారం బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు చక్రహరి రామరాజు ఆధ్వర్యంలో బీపీ మండల్‌ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా బీపీ మండల్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కంది సూర్యనారాయణ, కాసోజు విశ్వనాథం, నల్ల సోమ మల్లన్న, కేశబోయిన శంకర్‌, గుంటోజు గోవర్ధన్‌, జెల్లా ఆదినారాయణ, వాడపల్లి సాయిబాబా, పసుపులేటి సీతారాములు, నల్లమేకల మధుయాదవ్‌, తవడబోయిన వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ఫ 11 పీహెచ్‌సీల్లో ప్రతి మంగళవారం వైద్యం

ఫ ఇప్పటి వరకు 1,33,862 మందికి క్యాన్సర్‌ పరీక్షలు

ఫ 6,902 మంది క్యాన్సర్‌ అనుమానితులను జీజీహెచ్‌కు రెఫర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement