రామగిరి (నల్లగొండ) : జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి హిమబిందు మంగళవారం నల్లగొండలోని బాలసదన్, శిశుగృహాలను తనిఖీ చేశారు. కేంద్రాల నిర్వహణ తీరును, అలాగే అక్కడ ఉన్నవారికి అందిస్తున్న ఆహారం ఇతర సౌకర్యాలను, వారు నిర్వహించే రికార్డులను ఆమె పరిశీలించారు. అక్కడ పనిచేస్తున్న వారికి ఆమె చట్టపరమైన అంశాల గురించి అవగాహన కల్పించారు.
గౌడ సంఘం జిల్లా నూతన కమిటీ ఎన్నిక
నల్లగొండ టౌన్ : గౌడ సంఘం నల్లగొండ జిల్లా నూతన కమిటీని మంగళవారం జిల్లా కేంద్రంలోని దేవరకొండ రోడ్డులో గల ఓ ఫంక్షన్ హాల్‌లో జిల్లా అధ్యక్షుడు నకరికంటి కాశయ్య గౌడ్ అధ్యక్షతన ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా నకరికంటి కాశయ్య గౌడ్, ప్రధాన కార్యదర్శిగా పుల్లెంల శ్రీనివాస్ గౌడ్, గౌరవ అధ్యక్షుడిగా పొన్నం లక్ష్మయ్యలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన కమిటీ సభ్యులకు తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర నాయకులు నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ గౌడ్, రాష్ట్ర కోశాధికారి రవి గౌడ్, పుల్లెంల అచ్చాలు గౌడ్, వడ్డేపల్లి గోపాల్‌గౌడ్, ఆకునూరి నారాయణ గౌడ్, కొన్నే శంకర్ గౌడ్, సైదులు గౌడ్, జేరిపోతుల శంకర్ గౌడ్, ఇతగోని వెంకటేశ్వర్లు, సుర్గి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.


