బీజేపీని గద్దె దించే వరకు పోరాడుతాం | - | Sakshi
Sakshi News home page

బీజేపీని గద్దె దించే వరకు పోరాడుతాం

Aug 12 2026 3:04 AM | Updated on Aug 12 2026 3:04 AM

దేవరకొండ : దేశంలో ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు సీపీఐ పోరాటం ఆగదని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం స్పష్టం చేశారు. మంగళవారం దేవరకొండ మండలంలో కొనసాగిన సీపీఐ ప్రజా చైతన్య యాత్రలో ఆయన మాట్లాడారు. గడిచిన 12 ఏళ్ల బీజేపీ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఎద్దేవా చేశారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్‌ పేపర్లు లీక్‌ కావడంతో లక్షలాది మంది విద్యార్థులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల హక్కులను కాలరాస్తూ కొత్తగా తీసుకొచ్చిన లేబర్‌ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు పల్లా దేవేందర్‌రెడ్డి, రమావత్‌ అంజయ్యనాయక్‌, పల్లె నర్సింహ, తూం బుచ్చిరెడ్డి, మైనొద్దీన్‌, సుదర్శన్‌రెడ్డి, కనకాచారి, వెంకటేశ్వరరెడ్డి, వెంకటయ్య, రామాంజనేయులు, శైలేష్‌, రామస్వామి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement