ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కరించాలి

Jul 14 2026 4:53 AM | Updated on Jul 14 2026 4:53 AM

నల్లగొండ : ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ చంద్రశేఖర్‌ అన్నారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా నల్లగొండలోని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ గ్రీవెన్స్‌లో వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, పెండింగ్‌లో ఉంచవద్దని అధికారులను ఆదేశించారు. గ్రీవెన్స్‌లో మొత్తం 105 దరఖాస్తులు రాగా, రెవెన్యూ శాఖకు 55, మిగిలిన శాఖలకు 50 వచ్చాయని తెలిపారు. అనంతరం జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షపాతం లేకపోవడంతో తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, హాస్టళ్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో తాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మండల స్థాయి అధికారులు ప్రతి రెండు వారాలకు ఒకసారి హాస్టళ్లు, పీహెచ్‌సీలు, అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేసి, వాటి నివేదికలను స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్‌కు సమర్పించాలని సూచించారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌, స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్‌ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, అసిస్టెంట్‌ కలెక్టర్‌ (ట్రైనీ) శ్రీకాంత్‌రెడ్డి, డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఫ కలెక్టర్‌ చంద్రశేఖర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement