రసాయన మోతాదు మించడంతోనే ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

రసాయన మోతాదు మించడంతోనే ప్రమాదం

Aug 23 2026 1:52 AM | Updated on Aug 23 2026 1:52 AM

భూదాన్‌పోచంపల్లి: భూదాన్‌ పోచంపల్లి మండలం దోతిగూడెం గ్రామంలోని హెజెలో ల్యాబ్స్‌ ఫార్మా కంపెనీలో రియాక్టర్‌ పేలిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం చిన్నగూడెం గ్రామానికి చెందిన చెన్ను నాగిరెడ్డి, సూర్యాపేట జిల్లా మునగాల మండలం మాధవరం గ్రామానికి చెందిన రణబోతు రాజశేఖర్‌రెడ్డి, ఖమ్మం జిల్లా చౌడారం గ్రామానికి చెందిన నాగనబోయిన నరేశ్‌కుమార్‌ ఉన్నారు. పేలుడుకు మానవ తప్పిదమే కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. రాత్రి 10 గంటలకు మూడో షిఫ్ట్‌ ప్రారంభమైన సమయంలో రసాయనాల పరిమాణం సరిగ్గా తెలియక లిక్విడ్‌ అమ్మోనియా, హైడ్రోజన్‌ పెరాకై ్సడ్‌లను మోతాదుకు మించి కలపడంతో ఒత్తిడి పెరిగి పేలుడు సంభవించడానికి కారణమని అధికారులు గుర్తించారు. కూలెంట్‌ వ్యవస్థ వేడిని నియంత్రించలేకపోవడంతో ఒక రియాక్టర్‌ దెబ్బతిని, పక్కనే ఉన్న మరో రియాక్టర్‌ను ఢీకొన్నట్లు తెలిసింది. ప్రమాదం జరిగిన సమయంలో యూనిట్‌లో 120 మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. పేలుడు ధాటికి భవనం పైకప్పు రేకులు లేచిపోయాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తుండగా ఇద్దరు కెమిస్ట్‌లు మృతిచెందారు. మరో 9 మంది చికిత్స పొందుతుండగా వీరిలో ఒకరు శనివారం మృతి చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొన్నారు. చౌటుప్పల్‌, హయత్‌నగర్‌ ఫైర్‌స్టేషన్‌ నుంచి ఫైర్‌ఇంజన్ల సాయంతో నాలుగు గంటల పాటుశ్రమించి మంటలార్పారు.

కంపెనీలో 362 మంది ఉద్యోగులు, కార్మికులు

కంపెనీలో 362 మంది ఉద్యోగులు, కార్మికులు పనిచేస్తున్నారు. ప్రతి షిఫ్ట్‌లో 8 గంటల చొప్పున మూడు షిఫ్ట్‌లలో పనిచేస్తుంటారు. కంపెనీలో ముఖ్యంగా తెలంగాణలోని పలు జిల్లాల వారు, ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక, బిహార్‌, ఒడిశా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement