చేదెక్కిన చక్కెర, బెల్లం | - | Sakshi
Sakshi News home page

చేదెక్కిన చక్కెర, బెల్లం

Aug 23 2026 1:52 AM | Updated on Aug 23 2026 1:52 AM

న్యూస్‌రీల్‌

నల్లగొండ టౌన్‌: చక్కెర, బెల్లం ధరలు ఒక్కసారిగా మండిపోవడంతో మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. గడిచిన పది పదిహేను రోజుల్లోనే తీపి పదార్థాల ధరలు అమాంతం పెరిగాయి. పది రోజుల క్రితం కిలో రూ. 40 ఉన్న చక్కెర.. నేడు రూ.70కి చేరింది. అలాగే 20 రోజుల క్రితం కిలో రూ. 60 పలికిన బెల్లం.. ఇప్పుడు రూ. 80కి ఎగబాకింది. ప్రస్తుతం శ్రావణ మాసం, బోనాలు, వరలక్ష్మీ వ్రతాలతో పాటు వివా హాది శుభకార్యాలు ఎక్కువగా ఉండటంతో చక్కెర, బెల్లం వాడకం భారీగా పెరిగింది. ఉత్పత్తి తగ్గడం వల్లే ధరలు అమాంతం పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. కానీ, వ్యాపారులు సృష్టిస్తున్న కృత్రిమ కొరతేనని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిమాండ్‌ ఉన్న సమయంలో అక్రమంగా నిల్వలు ఉంచి, సామాన్యులకు అందుబాటులో లేకుండా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement