ఆరు నెలల కాలంలో జరిగిన ప్రమాదాలు ఇవీ..
రేపటి నుంచి ఆటోలు బంద్
రామగిరి(నల్లగొండ): ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహించనున్నట్లు జేఏసీ నాయకులు తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బంద్‌ను జయప్రదం చేయాలని కోరుతూ ఏఐటీయూసీ, బీఎమ్‌ఎస్, బీఆర్‌టీయూ, సీఐటీయూ, ఐఎన్‌టీయూసీ సంఘాల ప్రతినిధులు శనివారం ప్రచారం చేపట్టారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి రూ.12 వేల ఆర్థిక సాయం అందించాలని, సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వాహనాల కొనుగోలుపై 2శాతం సెస్ వసూలు చేసి, డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ద్వారా భద్రత కల్పించాలి. ఆర్టీసీ ద్వారా కొత్త ఎలక్ట్రిక్ ఆటోలను ప్రవేశపెట్టే ప్రతిపాదనను విరమించుకోవాలని, పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యవసరాల ధరలకు అనుగుణంగా ఆటో మీటర్ చార్జీలను సవరించాలని, ఓలా, ఊబర్, రాపిడో వంటి యాప్‌ల దోపిడీని అరికట్టేందుకు ప్రభుత్వమే సొంత యాప్‌ను తీసుకురావాలని, చట్టవిరుద్ధంగా నడుస్తున్న టూ వీలర్ టాక్సీలను నిషేధించాని డిమాండ్ చేశారు. రవాణా కార్మికులందరూ స్వచ్ఛందంగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
సాక్షి యాదాద్రి, చౌటుప్పల్, చిట్యాల:
రసాయన కంపెనీల్లో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. పరిశ్రమల్లో భద్రతను గాలికివదిలేయడంతో రియాక్టర్లు పేలి కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. యాజమాన్యాల నిర్లక్ష్యం , అధికారుల ఉదాసీనత వెరసి ఈ పరిశ్రమలు మృత్యువుకు వేదికలవుతున్నాయి. ఆరు నెలల కాలంలో జిల్లాలోని పరిశ్రమల్లో ఆరు ప్రమాదాలు చోటుచేసుకోగా ఆరుగురు మృత్యువాత పడ్డారు. తాజాగా శుక్రవారం భూదాన్ పోచంపల్లి మండలం ధోతిగూడెంలోని హెజెలో ఫార్మా కంపెనీలో జరిగిన ఘోర ప్రమాదం పరిశ్రమల్లోని డొల్లతనానికి నిదర్శనం. వరుస ఘటనలు జనాలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ప్రధానంగా భువనగిరి, బీబీనగర్ పారిశ్రామిక వాడలతో పాటు యాదగిరిగుట్ట, భూదాన్‌పోచంపల్లి, చౌటుప్పల్, చిట్యాల, ఆలే రు, బొమ్మలరామారం మండలాల్లో అధికంగా రసాయన కంపెనీలు ఉన్నాయి. కంపెనీలు వెదజల్లే జల, వాయు కాలుష్యంతో ప్రజలు రోగాల బారిన పడుతుంటే తరుచూ జరుగుతున్న ప్రమాదాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ ప్రమాదాలకు గల కారణాలు తెలుసుకొని పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడంలో యాజమాన్యాలు, అధికారులు విఫలమతున్నారు. ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే హడావుడి చేసే అధికారులు ఆ తర్వాత ఊసే ఎత్తడం లేదు. ఇలాంటి చర్యల కారణంగానే కంపెనీలలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు బలవుతున్నారు.
నిర్వహణ లోపం..
కంపెనీల్లో గతంలో రసాయన వాసనలు, గ్యాస్ లీకేజీలు, వేడి పెరగడం, పరికరాల వైబ్రేషన్లు వంటి హెచ్చరికలు కనిపించినా వాటిని తేలికగా తీసుకుంటున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ విషయంపై కార్మికులు, స్థానికులు చేసిన ఫిర్యాదులపై అధికారుల స్పందన అంతంతమాత్రంగానే ఉంటోంది. చిన్న అగ్ని ప్రమాదం, పీడనం పెరగడం, రియాక్టర్ ఆగిపోవడం, గ్యాస్ లీకేజీ, పెద్ద ప్రమాదానికి ముందస్తు హెచ్చరికలు ఉన్నా యాజమాన్యాలు సకాలంలో స్పందించడంలేదు. ప్రమాదం జరిగినప్పుడు తాత్కాలిక మరమ్మతులు చేసి వదిలేస్తున్నారు. నిర్వహణ లోపాలు, భద్రతా వ్యవస్థ వైఫల్యాలను అధికార యంత్రాంగం పట్టించుకోనందునే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
కంపెనీల్లో తనిఖీల సమయంలో అధికారులు మొక్కుబడిగా వ్యవహరిస్తున్నారు. గత తనిఖీ నివేదికలు, షోకాజ్ నోటీసులు పరిశీలించి వదిలేస్తున్నారు. కార్మికులు, గ్రామస్తులు చేసిన ఫిర్యాదులను బుట్టుదాఖలు చేస్తున్నారు. రియాక్టర్ నిర్వహణ, మరమ్మతుల లాగ్‌బుక్‌ల తనిఖీలను నామమాత్రంగానే చేస్తున్నారు. ఉష్ణోగ్రత–పీడనం నమోదైన డేటా, ప్రమాదాలు, ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్లు, అత్యవసర డ్రిల్ రికార్డులు పరిశీలించడంలేదు. ప్రమాదాల్లో కార్మికుల ప్రాణాలు పోతున్నా బాధ్యులైన యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవడంలేదన్న ఆరోపణలున్నాయి. కంపెనీ సీజ్ చేయడం, ఉత్పత్తి నిలిపివేత, లైసెన్స్‌రద్దు, క్రిమినల్ కేసులు, బాధ్యుల వ్యక్తిగత జవాబుదారీతనం వంటి చర్యలు తీసుకోనందునే ప్రమాదాలు నిత్యకృత్యమవుతున్నాయి.
రసాయన కంపెనీల్లో భద్రత కరువు ఫ తరచూ పేలుతున్న రియాక్టర్లు
ఫ ఆరు నెలల వ్యవధిలో ఆరు ప్రమాదాలు..
ఆరుగురు మృత్యువాత
ఫ వరుస ప్రమాదాలతో పరిసర గ్రామాల ప్రజల్లో భయాందోళన
ఫ పట్టింపులేని యాజమాన్యాలు
ఫిబ్రవరి 13న చౌటుప్పల్ మండల పరిధిలోని ఎల్లగిరి గ్రామంలోని బృందావన్ లేబోరేటరీస్ కంపెనీలో రియాక్టర్ పేలుడుతో నలుగురు కార్మికులు గాయపడ్డారు. పెద్ద భవనాలు పూర్తిగా దెబ్బతినడంతో భారీగా ఆస్తినష్టం జరిగింది.
ఫిబ్రవరి 20న భూదాన్‌పోచంపల్లి మండలంలో ధోతిగూడెంలోని వీజె సాయి కెమికల్ కంపనీలో రియాక్టర్ పేలి ఖమ్మం జిల్లా గట్టు సింగారం గ్రామానికి చెందిన కెమిస్టు ధార పవన్ మృతిచెందాడు.
ఏప్రిల్ 10న చిట్యాల మండలం బొంగోనిచెర్వులోని నోష్ ల్యాబ్‌లో రియాక్టర్ పేలుడులో ఇద్దరు గాయపడ్డారు.
మే1న కూడా నోష్ ల్యాబ్‌లో రియాక్టర్ పేలుడులో ఒకరు మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారు.
జూలై 16న భూదాన్‌పోచంపల్లి మండలంలో ధోతిగూడెంలోని హెజెలో ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపనీలో రియాక్టర్‌ను శుభ్రం చేస్తుండగా విడుదలైన విషవాయువులను పీల్చి ఆంధ్రప్రదేశ్‌లోని సింగమల్లు మండలం ఉల్లిౖకైలు గ్రామానికి చెందిన ఆలమూరు కృష్ణారెడ్డి మృతి చెందాడు.
ఆగస్టు 21న భూదాన్‌పోచంపల్లి మండలంలో ధోతిగూడెంలోని హెజెలో ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి ముగ్గురు ఉద్యోగులు మృతి చెందగా 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి.


