నల్లగొండ టౌన్: ఉమ్మడి జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారుల నూతన కార్యవర్గాన్ని శనివారం నల్లగొండలో జరిగిన సమావేశంలో ఎన్నుకున్నారు. ఎకై ్సజ్ సీఐ ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో చైర్మన్‌గా గాయం శ్యామ్‌కుమార్, వైస్ చైర్మన్‌గా శ్రీనివాస్‌రెడ్డి, కోశాధికారిగా షాహిన్‌బేగం ఎన్నికయ్యారు.
టీజీపీఆర్‌ఎల్‌ఏ రాష్ట్ర సెక్రటరీగా శ్రీనివాస్
రామగిరి(నల్లగొండ): తెలంగాణ గెజిటెడ్ పాలిటెక్నిక్ లెక్చరర్స్ అసోసియేషన్ సెక్రటరీగా నల్లగొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకుడు చినేని శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం నిర్వహించిన సంఘం సమావేశంలో ఆయన ఎన్నికయ్యారు. శ్రీనివాస్ ఎన్నికపై ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు.


