ఉమ్మడి జిల్లా నుంచి ఏడుగురు ఉపాధ్యాయులు ఎంపిక
పెద్దవూర : తెలంగాణ విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దడానికి గాను జపాన్, సింగపూర్ దేశాల్లో విద్యా విధానాల అధ్యయనానికి వెళ్లే బృందంలో ఉమ్మడి జిల్లా నుంచి ఏడుగురు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. వీరిలో జీహెచ్‌ఎం, ప్రిన్సిపాల్, స్కూల్ అసిస్టెంట్, ఎస్‌జీటీ విభాగాలకు చెందిన ఉపాధ్యాయులు ఉన్నారు. ఇందులో జపాన్ దేశానికి నలుగురు, సింగపూర్‌కు ముగ్గురు చొప్పున వెళ్లనున్నారు. వీరిలో నలుగురు ఉపాధ్యాయుల బృందం వచ్చే నెల 5 నుంచి 12వ తేదీ వరకు ఎనిమిది రోజుల పాటు జపాన్ దేశంలో పర్యటిస్తుంది. అలాగే మరో ముగ్గురు ఉపాధ్యాయులు గల రెండో బృందం ఈనెల 12 నుంచి 19వ తేదీ వరకు సింగపూర్‌లో పర్యటించనుంది. రెండు బృందాలు ఎనిమిది రోజుల చొప్పున ఆయా దేశాల్లో పర్యటించి అక్కడి విద్యా విధానాలను అధ్యయనం చేసి నివేదికలు ఇవ్వనున్నాయి.
జపాన్ వెళ్లే బృందంలో నలుగురు వీరే..
● సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కర్విరాల మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ తల్లూరి సాయి ఈశ్వరి.
● నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం వెంకటేశ్వరనగర్(మాల్) జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన గెజిటెడ్ హెడ్‌మాస్టర్ అడపాల వాణి.
● సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన స్కూల్ అసిస్టెంట్ టీచర్ మారం పవిత్ర.
● సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం రంగాపురం ఎంపీపీఎస్‌కు చెందిన ఎస్‌జీటీ ఉపాధ్యాయుడు చారుగుండ్ల రాజశేఖర్‌లు
ఎంపికయ్యారు.
సింగపూర్ పర్యటనకు వెళ్లే వారు..
● యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి జెడ్పీహెచ్‌ఎస్ గెజిటెడ్ హెడ్‌మాస్టర్ ఆర్.శ్రీనివాస్.
● నల్లగొండ జిల్లా గుడిపల్లి జెడ్పీహెచ్‌ఎస్ స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయురాలు తీగల శ్రీవిద్య.
● సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తొండ గ్రామంలోని ఎంపీపీఎస్ ఎస్‌జీటీ ఉపాధ్యాయురాలు ఉప్పు మంగతాయే ఎంపికయ్యారు.
డాక్యుమెంట్ల సమర్పణ పూర్తి
ఇప్పటికే జపాన్, సింగపూర్ దేశాల పర్యటనకు వెళ్లే ఉపాధ్యాయులందరి డాక్యుమెంట్ల సమర్పిణ పూర్తిచేశారు. సింగపూర్, జపాన్ దేశాలకు వెళ్లే బృందాల్లో రాష్ట్రం నుంచి 40 మంది ప్రతినిధులు ఉంటారు. వీరిలో 29 మంది చొప్పున ఉపాద్యాయులు, 11 మంది వివిధ హోదాలు గల అధికారులు, సాంకేతిక, వృత్తి విద్యా నిపుణులు ఉన్నారు.
ఫ జపాన్‌కు నలుగురు.. సింగపూర్‌కు ముగ్గురు
ఫ వచ్చేనెల 5 నుంచి 12 వరకు ఒక బృందం
ఫ 12 నుంచి 19వ తేదీ వరకు మరో బృందం
ఫ అక్కడి విద్యా విధానాల అధ్యయనానికి ..


